కరోనా నేపథ్యంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రాకూడదని పదే పదే  పోలీసులు చెప్తున్న సరే రోజుకు కొన్ని వందల మంది రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్ రిషి ధావన్ కూడా లాక్ డౌన్ రూల్స్ ను అతిక్రమించాడు. హిమాచల్ ప్రదేశ్ లో బ్యాంకు పనిమీద బయటికి వచ్చిన  రిషి ధావన్ కారును పోలీసులు ఆపారు. అయితే ధావన్ దగ్గర వెహికిల్ పాస్ లేకపోవడంతో అతనికి 500  జరిమానా విధించారు. వెంటనే ధావన్ ఆ జరిమానాను చెల్లించాడు. 
 
ఇక ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన 30 ఏళ్ళ ఈ ఆల్ రౌండర్ 2016లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ధావన్ జట్టులో స్థానాన్ని కాపాడుకోలేకపోయాడు. టీమిండియా తరపున ధావన్ మూడు వన్డేలు , ఓ టీ 20 మ్యాచ్ ఆడాడు. ఇక ఐపీఎల్  లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ,ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్  జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న ధావన్ 79ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 3702 రన్స్ చేయగా 308 వికెట్లు పడగొట్టాడు. అలాగే లిస్ట్ ఏ క్రికెట్ లో 125 వికెట్లను పడగొట్టాడు. ఇదిలావుంటే కరోనా పై పోరుకు బీసీసీఐ 51 కోట్లు విరాళం ఇవ్వగా టీమిండియా తరపున కోహ్లీ , రోహిత్, రైనా, శిఖర్ ధావన్ లతో పాటు మాజీ క్రికెటర్లు  సచిన్, గౌతమ్ గంభీర్,యువరాజ్ సింగ్  విరాళాలను ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: