ఒక కుటుంబం నుండి ఒకరు భారత క్రికెట్ జట్టు చోటు సంపాదించడం అంటేనే చాలా పెద్ద విషయం. అలాంటిది ఒకే కుటుంబం నుండి అన్నదమ్ములు ఇద్దరూ దేశవాలి లో తన సత్తా చాటి జాతీయ జట్టులో చోటు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అన్నీ క్రీడలలో చాలా మంది అన్నదమ్ములు జంటగా ఆడి తమ దేశానికి పేరు తేవడం చూస్తూనే ఉన్నాం. అలాగే ప్రపంచంలోనే రెండవ అత్యంత ప్రజాదరణ ఉన్న క్రీడ క్రికెట్ చరిత్రలో కూడా చాలా మంది అన్నదమ్ములు వివిధ దేశాలకు కలిసి ఆడి ప్రేక్షకులను అలరించారు. తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా ఏపీ హెరాల్డ్ మీకు అందిస్తున్నా ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇదే..!

 

భారత క్రికెట్ జట్టులో మూడు అన్నదమ్ముల జంటలు జాతీయ క్రికెట్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాయి. లెజెండరీ క్రికెటర్ లాలా అమర్ నాథ్ కొడుకులైన మొహిందర్ అమర్నాథ్ మరియు సురీంద్ర అమర్ నాథ్ ఇద్దరూ మొట్టమొదటిసారి ఒక అన్నదమ్ముల జంట భారత జట్టుకు ఆడిన ఘనతను సాధించారు. సురీంద్ర అమర్నాథ్ కేవలం 10 టెస్టులు ఆడి 30.55 బ్యాటింగ్ యావరేజ్ తో ఉత్తమ స్కోరు 124 గా తన కెరియర్ ముగించాడు. కానీ మోహిందర్ అమర్నాథ్ మాత్రం భారత దేశపు గొప్ప బ్యాట్స్మెన్ లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్, మాల్కమ్ మార్ష్ వంటి వారే అతనిని తెగ పొగిడేశారు. ఒకే సీజన్ లో 1000 పరుగులు సాధించిన అతి కొద్ది మంది భారత బ్యాట్స్మెన్లలో ఇతను కూడా ఒకడు.

 

ఇక రెండవ జంట పఠాన్ బ్రదర్స్. ఇర్ఫాన్ పఠాన్ మరియు యూసఫ్ పఠాన్ ఇద్దరూ భారతదేశం ఇటీవల కాలంలో సాధించిన రెండు ప్రపంచ కప్ జట్టులలో భాగస్వాములుగా ఉన్నారు. 2007 ప్రపంచ కప్ లో ఇర్ఫాన్ పఠాన్ తన స్వింగ్ బౌలింగ్ తో భారత్ టీ-20 ప్రపంచకప్ చేపట్టడంలో ప్రముఖ పాత్ర పోషించగా ధనాధన్ బ్యాటింగ్ తో యూసఫ్ 2011 ప్రపంచకప్ సాధించడంలో ఒక చేయి వేశాడు. ఈ బరోడా బ్రదర్స్ ఇద్దరూ అటు బ్యాట్ మరియు బంతితో కూడా కొద్ది సంవత్సరాలు భారత జట్టు తమ సేవలు అందించడం క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు.

 

ఇక తాజాగా భారత ప్రేక్షకులను కనువిందు చేస్తున్నారు చివరి అన్నదమ్ముల జోడి పాండ్యా బ్రదర్స్. భీకరమైన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మరియు ప్రతిభావంతుడైన అతని అన్న కృనాల్ పాండ్యా ఇద్దరూ కలిసి భారత జట్టుకు ఆడిన సందర్భాలు ఉన్నాయి. వీరిద్దరిలో తమ్ముడు హార్దిక భారత జట్టుకు రెగ్యులర్ ప్లేయర్ గా మారగా కృనాల్ జట్టులోకి వస్తూ పోతూ ఉంటాడు. వీరిద్దరు కలసి భారత జట్టు తరపున కొన్ని టీ-20 మ్యాచ్ లు ఆడారు. అయితే పఠాన్ సోదరులే తమకి ఆదర్శమని వీరు ఒకసారి చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: