భారత క్రికెట్ లో మిస్టర్ కూల్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయవంతమైన కెప్టెన్ గా  భారత్ కి రెండు ప్రపంచకప్ లు  అందించిన ఏకైక సారథిగా మహేంద్రసింగ్ ధోని భారత క్రికెట్ చరిత్రలో పేరు లిఖించుకున్నాడు. కానీ గత కొంతకాలంగా ధోని క్రికెట్ కు దూరంగా ఉండడంతో ధోని కెరియర్  ప్రశ్నార్థకం గా మారిపోయింది. అయితే ఈ సంవత్సరం జరిగే ప్రపంచ కప్ తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో... ధోని ఐపీఎల్ లో నిరూపించుకుంటేనే  ప్రపంచ కప్ లో  అవకాశం దక్కుతుంది అని అప్పట్లో విశ్లేషకులు కూడా చెప్పారు. అటు  ధోనీ కూడా ఐపీఎల్ లో తనని తాను నిరూపించుకోవడానికి సిద్ధమయ్యాడు. కానీ ఇంతలో ఐపీఎల్ వాయిదా పడడంతో తన కెరీర్ ప్రస్తుతం ప్రశ్నార్థకం గా మారిపోయింది. 

 

 

ధోనీ ఒక వేళ ఆడాలి అనుకున్నప్పటికీ ప్రపంచకప్లో తుది జట్టులో అవకాశం వస్తుందా లేదా అని  కూడా అందరిలో ప్రశ్న  నెలకొంది. అయితే తాజాగా  ధోనీ కెరీర్ పై  స్పందించారు భారత సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్. తాజాగా ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో హాజరైన కృష్ణమాచారి శ్రీకాంత్... ధోని  విషయంలో తాను ఆచితూచి మాత్రమే స్పందించాలని భావించడం లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీ రద్దయితే ధోని కి తిరిగి జట్టులోకి పునరాగమనం చేసే  అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. 

 

 

 ఒకవేళ ప్రస్తుతం తాను భారత సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఉంటే నేను ఏం చేస్తాను అన్న విషయాన్ని మాత్రమే చెబుతున్నాను అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడు  ఐపీఎల్ జరగకుంటే ధోని జట్టులోకి  రావడం కష్టమే అని చెప్పాలి. ఇక భారత సెలక్షన్ కమిటీ వ్యక్తులను చూసి జట్టును ఎంపిక చేయబోదు... జట్టు  ప్రయోజనాలే ముఖ్యం అంటూ...  అభిప్రాయం వ్యక్తం చేశాడు సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా వికెట్-కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ గా రిషబ్ పంత్ బాగా  సరిపోతాడని.. కెఎల్ రాహుల్ కూడా  తన మదిలో ఉన్నప్పటికీ తాను మాత్రం రిషబ్ పంత్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతానని తెలిపాడు. ఐపీఎల్ జరగకపోకపోతే ధోని పేరు తన మనసులో కి రాదు అంటూ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: