ఈ సంవత్సరం జరగవలిసిన ఐపీఎల్ - 2020 సీజన్ మళ్లీ వాయిదా పడటం కచ్చితంగా కనిపిస్తోంది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం... మార్చి 29 నుంచి ఐపీఎల్ - 2020 సీజన్ మొదలు కావలిసి ఉండగా.. అయితే కరోనా వైరస్ దెబ్బకి ఏప్రిల్ 15 కి ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వాయిదా వేసింది. అయితే ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో.. 21 రోజుల లాక్‌ డౌన్‌ ని ప్రధాని మోడీ మరో 14 రోజులు పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. దీనితో ఐపీఎల్ మళ్లీ వాయిదా పడేలాగే ఉంది.

 


అయినా ఐపీఎల్ ఆడదానికి కూడా ఇతర దెస ప్లేయర్స్ కూడా ఆడాల్సి ఉంది. వారు కూడా ఇక్కడికి చేరుకోవడానికి ఎవరు ఉత్సహంగా లేరు. దీనితో ఐపీఎల్ - 2020 ఇప్పట్లో జరిగే ఛాన్స్ లేదనే చెప్పవచ్చు. అయితే మరి వాస్తవానికి ఏప్రిల్ 15 తర్వాత IPL - 2020 సీజన్ ప్రారంభం అవ్వకపోతే.. ఈ ఏడాది టోర్నీ పూర్తిగా రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వచ్చాయి. 

 


కాకపోతే ఒకవేళ IPL రద్దయితే మాత్రం సుమారు రూ. 3000 కోట్లు bcci నష్టపోనుందని తెలుస్తోంది. దీనితో IPL - 2020 ని సెప్టెంబరు- అక్టోబరులో టోర్నీ నిర్వహణకి అనువైన మార్గాల్ని bcci ప్రస్తుతం పరిశీలిస్తోంది. కాకపోతే.. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా లాక్‌ డౌన్ పొడిగింపు తేదీని ప్రకటించిన తర్వాతే IPL వాయిదా తేదీని bcci చెప్పనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: