టీమిండియా మాజీ సారథి దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని భవితవ్యం ఏమిటి అనే దానిపై ప్రస్తుతం భారత క్రికెట్ లో చర్చ జరుగుతోంది. అయితే ఈ చర్చ ఇప్పటిది కాదు ఎన్నో నెల నుంచి ధోని కెరీర్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. అయితే 2019 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ధోని క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడు అని అందరూ అనుకున్నారు కానీ... ధోనీ మాత్రం రిటైర్మెంట్కు ఊసే ఎత్తలేదు . ఈ నేపథ్యంలో ఈ ఏడు జరగబోయే ప్రపంచకప్ కోసం ఎదురు చూస్తున్నాడు అనుకున్నారు అందరు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో తన సత్తా చాటి మరోసారి జట్టులోకి పునరాగమనం కావాలని ధోని  అనుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్నో రోజుల తర్వాత ధోని  ఐపీఎల్ కోసం మైదానంలోకి కూడా అడుగుపెట్టాడు. కానీ కరోనా వైరస్  కారణంగా ఐపీఎల్ కాస్త వాయిదా పడింది. 

 

 

 అయితే తాజాగా ధోని  ప్రాక్టీస్ గురించి చెన్నై సూపర్ కింగ్స్ ఫిజియో టామీ సిమ్సెక్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే లాక్ డౌన్  కు ముందు నిర్వహించిన ట్రైనింగ్ క్యాంప్ లో ధోని ఎంతో తీవ్రంగా సాధన చేసాడు అంటూ చెప్పుకొచ్చాడు చెన్నై సూపర్ కింగ్స్ ఫిజియో టామీ.  అయితే గత పదేళ్ల నుంచి ధోని  కీపింగ్ ప్రాక్టీస్ చేయడం ఎప్పుడూ చూడలేదని... కానీ తాజాగా మొదటిసారి ధోని కీపింగ్ ప్రాక్టీస్ చేయడం చూశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ లో రాణించి ఇండియన్ జట్టులో స్థానం సంపాదించాలని పట్టుదల తపన  ధోనిలో  కనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు. 

 

 

 అయితే ధోని  భవితవ్యం ఐపీఎల్ తో ముడిపడిన విషయం తెలిసిందే . గత ఎనిమిది నెలల నుంచి క్రికెట్ కు  పూర్తిగా దూరంగా ఉన్నా మహేంద్రసింగ్ ధోని ప్రస్తుత జట్టులో మళ్లీ స్థానం సంపాదించాలంటే... ఐపీఎల్ టోర్నీలో ఎన్నో మెరుపులు మెరిపించి వలసి ఉంటుంది. అద్భుతమైన ప్రదర్శన చేస్తే తప్పా ధోనికి భారత జట్టులో చోటు దక్కే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ మరో దారి మైదానంలోకి దిగి  అదరగొడతాడు  అని అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ చివరికి కరోనా  వైరస్  కారణంగా ఐపీఎల్ టోర్నీ కాస్త  రద్దు అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో ధోనీ కెరీర్ మరింత క్లిష్టపరిస్థితుల్లో పడింది .

మరింత సమాచారం తెలుసుకోండి: