ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో కేవలం ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. వారు ఎవరో ఇప్పటికే మీకు అర్థమైవుంటుంది. మరెవరో కాదండి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా మేటి ఆటగాడు స్టీవ్ స్మిత్. ప్రపంచంలో ప్రస్తుతం మేటి ఆటగాడు ఎవరైనా అడిగితే వీరిద్దరి మధ్య తప్పించి ఇంక ఎవరి పేర్లు రాని సంగతి తెలిసిందే. అయితే తాజాగా పాకిస్థాన్ మాజీ బ్యాట్స్ మెన్ జహీర్ అబ్బాస్ ఈ విషయంపై ఒక అభిప్రాయాన్ని తెలిపాడు.

 

 


నిజానికి క్రికెట్ ఆట పరంగా స్మిత్, కోహ్లీలు సమఉజ్జీలు. అయితే టెస్టుల్లో స్మిత్ అత్యుత్తమని అతని రికార్డులు చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఇక కింగ్ కోహ్లీ విషయానికి వస్తే ఒక టెస్ట్ లోనే కాదు మిగతా ఫార్మెట్లో కూడా అతనికి తిరుగులేదని జహీర్ అబ్బాస్ పేర్కొన్నాడు. నిజానికి ప్రపంచ శ్రేణి అత్యుత్తమ బ్యాట్స్మన్ అనిపించుకోవాలంటే ఒక్క ఫార్మేట్ లో మాత్రమే మెరుగ్గానే సరిపోదు మొత్తం మూడు ఫార్మాట్లలో కూడా రాణించాలని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో మాత్రం అంతకంటే కోహ్లీ చాలా మెరుగ్గా ఉందని ఆయన తెలిపాడు. అంతే కాకుండా వీరి తర్వాతే డేవిడ్ వార్నర్ కూడా మూడు ఫార్మెట్లో అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడని తెలిపాడు. కాకపోతే అతనికి నిలకడ లోపించిందని తెలిపాడు.

 

 


ఇక కోహ్లీ గురించి మాట్లాడుతూ అతన్ని రన్నింగ్ మిషన్ అనకూడదు ఎందుకంటే మిషన్లు కూడా కొన్నిసార్లు రిపేరుకు వస్తాయి అలాంటప్పుడు అవి పని చేయవు. కానీ కోహ్లీ మాత్రం పరుగుల దాహానికి అలుపు అంటూ ఉండదు. ప్రస్తుతం కోహ్లీకి సరిపోయే బ్యాట్స్మెన్ ఎవరూ లేరనే చెప్పవచ్చు అంటున్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఆట పట్ల నిబద్ధత, అంకితభావం కొంతమంది యువ క్రికెటర్లు మాత్రమే చూస్తున్నానని త్వరలో చాలా మంది క్రికెటర్లు బయటికి వస్తారు అని అంటున్నాడు మాజీ పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్. అలాగే పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ అజామ్ కూడా మెరుగైన బ్యాట్స్మన్ అని అతడు మరిన్ని రికార్డులు బద్దలు కొడతాడు అని పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: