టీమిండియా మాజీ కెప్టెన్, భారత్ కి రెండు ఐసీసీ వరల్డ్ కప్ లను అందించిన మహేంద్రసింగ్ ధోని ఒక పద్ధతి ప్రకారం మ్యాచ్ లను ఫినిష్ చేస్తాడు అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ హస్సీ తెలిపాడు. ఇంతకుముందు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోని కెప్టెన్సిలో ఆడిన అతను, ధోనీ డెత్ ఓవర్లులో ఎలా బ్యాటింగ్ చేస్తాడో తెలిపాడు. 2008 సంవత్సరం నుంచి ఐపీఎల్ జరుగుతుండగా ఐపీఎల్ ప్రతి సీజన్లోనూ సెమిస్ చేరిన సూపర్ కింగ్స్ ఏకంగా మూడుసార్లు విజేతగా నిలిచింది.

 

 

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలోనే అతి గొప్ప ఫినిషర్ మహేంద్రసింగ్ ధోని అని అంటున్నాడు ఈ మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ మైఖేల్ హస్సీ. మామూలుగా మ్యాచ్ సమయంలో చాలా కూల్ గా ఉండి వ్యూహాలు రచిస్తాడని, మొదటిలోనే ప్రత్యర్థి టీమ్ ని బెదర కొడతాడని చెప్పుకొచ్చాడు. నిజానికి ధోని లో ఒక నమ్మలేని పవర్ దాగి ఉందని మైఖేల్ హస్సీ తెలిపాడు. నిజానికి బాల్ ఎప్పుడు బౌండరీ దాటించాలో, ఎప్పుడు నిదానంగా ఆడాలో ధోనికి బాగా తెలుసునని అలాగే అతను హిట్టింగ్ బాగా చేయడానికి కూడా తెలిపాడు. 

 


నిజం చెప్పాలి అంటే ధోని పై ఉన్న నమ్మకం నాపైన కూడా నాకు ఉండదు అని మైకేల్ హస్సీ తెలిపాడు. నిజానికి మ్యాచ్ చివర్లో ఒక ఓవర్లో 10 పరుగుల కంటే ఎక్కువ పరుగులు ఎలా సాధించాలో ధోని నుంచే నేర్చుకున్నానని ఆయన తెలిపాడు. నిజానికి ఆ సమయంలో ధోనీ కంటే ప్రత్యర్థి బౌలర్లకు ఎక్కువ ఒత్తిడి ఉంటుందని మైఖేల్ హస్సీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: