కరోనా వల్ల ఈఏడాది ఐపీఎల్ సీజన్ నిరవధిక  వాయిదాపడింది. ఈవిషయాన్ని రెండు రోజుల క్రితమే  బీసీసీఐ అధికారంగా ప్రకటించింది. అయితే ఐపీఎల్ కు మేము ఆతిథ్యం ఇస్తామని గురువారం రోజున శ్రీలంక క్రికెట్ బోర్డు  అధ్యక్షుడు షమ్మీ సిల్వా ప్రకటించాడు. తాజాగా  దీనిపై స్పందించింది బీసీసీఐ .. శ్రీలంక క్రికెట్ బోర్డు నుండి ఎలాంటి ప్రతిపాదన రాలేదని అయినా ప్రస్తుతం ప్రపంచమంతా లాక్ డౌన్ లో వుంది ఇలాంటి సమయంలో ఐపీఎల్ గురించి చర్చ అనవసరమని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి అన్నారు. 
 
ఇక కరోనా  విషయంలో ఇండియాతో పోల్చుకుంటే  శ్రీలంక లో చాలా మెరుగ్గా ఉంది. ఇప్పటివరకు ఇండియాలో 13000 కుపైగా కరోనా కేసులు నమోదు కాగా శ్రీలంక లో కేవలం 200 కేసులు మాత్రమే  నమోదయ్యాయి. దాదాపు  అక్కడ కరోనా భయం లేనట్లే దానికి తోడు ఐపీఎల్ ను అక్కడ నిర్వహిస్తే ఆర్థికంగా కూడా బోర్డు కలిసి రానుంది. ఒకేవేళ శ్రీలంకలో  నిర్వహించాల్సి వస్తే  మూడు స్టేడియాలు..  కొలంబో ,గాలే ,క్యాండీ రెడీ గా వున్నాయి.
 
ఇదిలావుంటే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే  ఈ ఏడాది ఐపీఎల్ పూర్తిగా రద్దైయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అయితే బీసీసీఐ దగ్గర ప్లాన్ బి  కూడా వుంది. ఒకవేళ  కరోనా పూర్తిగా తగ్గితే సెప్టెంబర్ -అక్టోబర్ మధ్య లో నైనా ఐపీఎల్ నిర్వహించాలనుకుంటుంది. ఇది కూడా సాధ్యం అయ్యే ఆవకాశాలు తక్కువే ఎందుకంటే అలా చేస్తే ఆ  సమయంలో జరుగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ ల షెడ్యూల్ ను మార్చాలి. దానికి తోడు వర్షాలు అలాగే అప్పటికి  విదేశీ ఆటగాళ్ల ఎంత మంది అందుబాటులో వుంటారో తెలియదు.ఇన్ని ప్రతికూలతల నడుమ టోర్నీ నిర్వహించిన సక్సెస్ అవుతుందో లేదో తెలియదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: