కరోనా వైరస్ పుణ్యమా అని ఇప్పటికే కొన్ని క్రికెట్ సిరీస్‌లు రద్దవగా.. ఇందులోనే ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీలు కూడా రద్దు అయ్యాయి. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరులో జరగాల్సిన టీ - 20 వరల్డ్‌ కప్‌ పైనా కూడా సందిగ్ధత నెలకొంది. ఆస్ట్రేలియా‌ దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో పర్యాటక వీసాలపై ఆ దేశం కాస్త కఠినంగా వ్యవహరిస్తోంది అని చెప్పవచ్చు.
 

IHG

అయితే షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ ఆ దేశంలో టీ - 20 వరల్డ్‌ కప్ జరగాల్సి ఉండగా, అప్పటిలోపు కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తుందా..? లేదా  అనేదానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఈ పరిస్థితులలో.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అక్కడ పరిస్థితుల్ని ఒక వైపు గమనిస్తూ, ఎప్పటికప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నుంచి సమాచారం అడిగి తెలుసుకుంటుంది. ఒకవేళ టీ - 20 వరల్డ్‌ కప్‌ ని రద్దు లేదా వాయిదా వేస్తే..? అక్టోబరు - నవంబరులో IPL 2020 సీజన్‌ ని నిర్వహించాలని bcci ఆలోచిస్తుంది.

 
ఇక టీ - 20 వరల్డ్‌ కప్ నిర్వహణ గురించి ICC అధికార ప్రతినిధి మాట్లాడుతూ ‘‘ప్రణాళిక ప్రకారం టోర్నీలు నిర్వహించేందుకు ICC ప్రయత్నాలు చేస్తోందని, ఆస్ట్రేలియాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, అలాగే టీ - 20 వరల్డ్‌ కప్ నిర్వహణపై సరైన సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం’’ అని వారు వెల్లడించాడు. ఈ సంవత్సరం జులై నెలలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కూడా వచ్చే సంవత్సరానికి వాయిదాపడగా.. అయితే ఇప్పటికే ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ కూడా వాయిదాపడిన విషయం అందరికి తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: