నేటితో టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ 28వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. నేడు కేఎల్ రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా సీసీఐ, బీసీసీఐతో పాటు భారత్ క్రికెటర్లు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇక హార్దిక్ పాండే సోషల్ మీడియాలో వేదికగా చేసుకొని " శుభాకాంక్షలు బ్రదర్ .." అంటూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే వీరి ఇద్దరి పాత ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Happy birthday brotherman ❣️ Always got your back ❣️

A post shared by hardik Pandya (@hardikpandya93) on

IHG
ఇక గత సంవత్సరం కాఫీ విత్ కరణ్ అనే కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొని అభ్యంతరమైన వాక్యాలు చేసి చాలా విమర్శలు ఎదుర్కొన్న సంగతి అందరికి తెలిసిందే కదా.. అప్పటినుంచి రాహుల్ తనదైన రీతిలో అద్భుతంగా ఆడుతూ టీమిండియాలో కీలక ప్లేయర్ గా ఎదిగాడు. ఎంతో మంది అభిమానాన్ని అందుకున్నాడు. దీనితో పాటు మూడు ఫార్మాట్లతో శతకం సాధించిన మూడో భారత బ్యాట్స్ మెన్ గా  తన పేరుని నమోదు చేసుకున్నాడు. 

 

 

ఇక మరోవైపు ట్విట్టర్ వేదికగా బీసీసీఐ కే ఎల్ రాహుల్  పాత ఫోటోని జత చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.  దీనితోపాటు ఐసీసీ కూడా ట్విట్టర్ వేదికగా " 36 టెస్టులు, 32 వన్డేలు, 42 టి 20 లు, 4,706 అంతర్జాతీయ పరుగులు " సాధించిన మొదటి ఆటగాడు అంటూ రాహుల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలియజేసింది. కే ఎల్ రాహుల్ కి భారత్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ తదితర క్రికెట్ ఆటగాళ్లు అందరూ శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: