టీం ఇండియా మాజీ ఆటగాడు, ఆల్ రౌండర్ లెఫ్ట్ హ్యాండర్ యువరాజ్ సింగ్ టీమిండియా జట్టు విజయాల్లో ఏ స్థాయిలో కీలక పాత్ర పోషించాడో అందరికి తెలిసిన విషయమే. ఇక అతని కెరీర్ లో ప్రధానంగా 2007, 2011 ప్రపంచకప్ జట్టు విజయంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. నిజానికి అతను రెండు టోర్నీల్లో అతని ఆట చరిత్రలో నిలిచిపోతుంది అన్న మాట నగ్న సత్యం. యువరాజ్ సింగ్ అటు బౌలింగ్ లో కూడా అందరిని ఆకట్టుకున్నాడు. అయితే తాజాగా అతను తన బ్యాటింగ్ గురించి ఒక కీలక విషయాన్నీ తెలిపాడు. 

 


ప్రముఖ ఛానెల్ స్పోర్ట్స్ తక్‌ తో జరిగిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌ లో టీ - 20 ప్రపంచ కప్ సెమీఫైనల్‌ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ లో ఒక సంఘటన యువి గుర్తు చేసాడు. అయితే ఆ సమయంలో ఆస్ట్రేలియా కోచ్ గా ఉన్న టిమ్ నీల్సన్ తన బ్యాట్‌ లో ఫైబర్ ఉందా అని అడిగాడని యువరాజ్ సింగ్ తెలిపాడు. ఆ మ్యాచ్ జరిగిన మరుసటి రోజున, ఆస్ట్రేలియా కోచ్ ఫుడ్ కోర్టులో నా వద్దకు వచ్చి నా బ్యాట్‌ లో ఏమైనా ఫైబర్ ఉందా అని అడిగాడు అని తెలిపాడు. నిజానికి నీ బ్యాట్ ‘ఈ బ్యాట్ చట్టబద్ధమైనదా?’ అని అతను అడిగినట్టు వివరించాడు యువరాజ్ సింగ్.

 

ఇది ఇలా ఉండగా అప్పుడు మ్యాచ్ రిఫరీ నా బ్యాట్‌ ను తనిఖీ చేసాడు అని తెలిపాడు. ఇక ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా తన బ్యాట్ గురించి కూడా సరదాగా అడిగినట్లు యువరాజ్ సింగ్ తెలిపాడు.  ఆడమ్ గిల్‌క్రిస్ట్ తన పూల్ సెషన్లో ... నా బ్యాట్‌ ను ఎవరు తయారు చేస్తారని కూడా అడిగాడు అని తెలిపాడు. దానితో నా బ్యాట్‌ ను మ్యాచ్ రిఫరీ తనిఖీ చేశాడని చెప్పుకొచ్చాడు. కాకపోతే  నిజాయితీగా, ఆ బ్యాట్ నాకు చాలా ప్రత్యేకమైనదని అంతవరకూ నేను ఎప్పుడూ అలాంటి బ్యాట్‌ తో మ్యాచ్ ఆడలేదన్నాడు యువరాజ్ సింగ్. అప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో కేవలం 30 బంతుల్లో 70 పరుగులతో వీర విహారం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: