ఇండియా టీం క్రికెట్ కోసం కాకుండా స్వార్థంతో వారి కోసంఆడతారని, అయితే మేము దేశం కోసం క్రికెట్ ఆడుతున్నాము అంటూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ ఆరోపణలు చేయడం జరిగింది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా పాకిస్థాన్ లో లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకుని రావడం జరిగింది దీంతో క్రికెట్ ఆటగాళ్లు అంతా కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే తన సహచర క్రికెటర్ రమీజ్ రాజాతో కలిసి ఇటీవల ఒక వీడియో చాట్ లో మాట్లాడడం జరిగింది. ఈ తరుణంలోనే పాక్ క్రికెటర్లు కేవలం టీం కోసమే ఆడతారని జవాబిచ్చాడు ఇంజమామ్. కానీ భారత క్రికెటర్లు మాత్రం వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడతారు అంటూ విమర్శలు చేశాడు.

 

ఇక మన టీంతో పోలిస్తే భారత్ బ్యాటింగ్ ఆర్డర్ లో చాలా పవర్ ఫుల్ గా వాడుతారు అని తెలిపాడు. కానీ పాకిస్తాన్ బ్యాట్స్ మెన్స్ ఎవరైనా 30 నుంచి 40 పరుగులు తీసిన కూడా అది టీం కోసమే చేస్తారు అంటూ మాట్లాడడం జరిగింది. అయితే టీం ఇండియా బ్యాట్స్ మెన్స్ లో మాత్రం సెంచరీ పరుగులు తీసిన కూడా వారి స్వార్థం కోసం ఆడతారే తప్ప టీం కోసం మాత్రం కాదు అంటూ విమర్శలు చేశాడు. ఇక పాక్ భారత్ క్రికెట్ ఆటగాళ్ళ మధ్య తేడా ఇదేనంటూ ఇంజమామ్ తెలిపాడు.

 


ఇక బౌలింగ్ విషయానికి వస్తే... భారత్ క్రికెటర్లకు గట్టిపోటీ ఇస్తుంది పాకిస్తాన్. కానీ బ్యాటింగ్ పరంగా మాత్రం దశాబ్దాలుగా తేలిపోతూనే వస్తుంది అంటూ తెలిపాడు. అంతేకాకుండా రికార్డుల గురించి ఆలోచిస్తే పాక్ అంటే భారత్ బ్యాట్స్ మెన్స్ చాలా ముందు ఉంటారు అనే చెప్పాలి. అలాగే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 100 శతకాలతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఇప్పటికే విరాట్ కోహ్లీ 70 శతకాలతో దిగ్గజ క్రికెటర్ అన్న మంచి పేరు దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ నుంచి ఇలాంటి తరహా స్థాయిలో ఎవరు ఏ బ్యాట్స్ మెన్స్ లేరు అని ఇంజమామ్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: