ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి  భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన 47వ వసంతంలోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. క్రికెట్ చరిత్రలో ఎంతగానో పేరు ప్రఖ్యాతులు సంపాదించి భారత జట్టుకు ఎంతో ఖ్యాతిని  సంపాదించిపెట్టిన గొప్ప ఆటగాడు సచిన్ టెండూల్కర్. కొన్ని దశాబ్దాల పాటు భారత జట్టులో కొనసాగుతూ కీలక ఆటగాడిగా భారత జట్టుకు  అసాధారణ విజయాలను అందించిన  గొప్ప ఆటగాడు సచిన్ టెండూల్కర్.  ఒక భారత క్రికెట్ కే వన్నెతెచ్చిన గొప్ప ఆటగాడు. భారత క్రికెట్ పుస్తకం లో తనకంటూ చాలా పేజీలు లిఖించుకున్నాడు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. 

 

 అయితే తాజాగా సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా భారత ప్రజలందరికీ స్ఫూర్తినిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టారు. ప్రజలందరూ నేను బయటకు రాకూడదు అంటూ ప్రార్థించారు... ప్రస్తుతం నేను భారత ప్రజలెవ్వరు బయటకి రాకూడదు ప్రార్థిస్తున్నాను  అంటూ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికలో ఓ పోస్ట్  పెట్టారు. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈరోజు తన 47వ పుట్టిన రోజునే తాను జరుపుకోవడం లేదని కరోనా  వైరస్ కారణంగా లాక్ డౌన్  ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు అంటూ సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు. 

 


 కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పెద్ద పోరాటం కొనసాగుతుందని... భారత జాతీయ మానసిక స్థితికి  అనుగుణంగా క్రికెట్ దిగ్గజం సచిన్ రమేష్ టెండూల్కర్ తన 47వ పుట్టినరోజున జరుపుకోకూడదు  అంటూ నిర్ణయం  తీసుకున్నట్టు తెలిపారు. అయితే తన పిల్లలు సారా, అర్జున్ లు  తనను కేక్ కట్ చేయమని పట్టుబడతారో  లేదో... తనకు తెలియదు కానీ...ప్రస్తుత  వాతావరణం మాత్రం పండుగ వాతావరణం కాదని..  ఇది అసాధారణమైన సమయం అంటూ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్లో పోస్టు పెట్టాడు.కాగా  సోషల్ మీడియా వేదికగా క్రికెట్  దిగ్గజం సచిన్ టెండూల్కర్కు బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: