మెగాస్టార్ చిరు... ఉగాది రోజున సోషల్ మీడియాలో అడుగుపెట్టారో.. ఇక అప్పటి నుంచి మొదలు ఆయనకు సంబంధించిన దాదాపు ప్రతి విషయాలను అభిమానులతో పాటు ప్రేక్షకులతో ఆయన పంచుకుంటున్నారు. ఇంకా అంతేనా తనకు తెలిసిన వారి లేక ఎవరైనా సెలబ్రెటీల పుట్టినరోజులకు సంబంధించి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నాడు మెగాస్టార్. ఇక ఇప్పటికే అల్లు అర్జున్, అకిరానందన్‌, అఖిల్ ‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసారు.


ఈ మధ్య వచ్చిన ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా బర్త్ డే విషెస్ తెలియజేసిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ రోజు భారత క్రికెట్ అభిమానులతో క్రికెట్ దేవుడిగా పిలవబడుతున్న సచిన్ టెండూల్కర్ ‌కు బర్త్ డే విషెస్ చిరు తెలియజేసారు. ఇక అంతేనా అప్పట్లో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ‌తో ఉన్న ఒక పాత ఫోటోను అభిమానులతో చిరు షేర్ చేసుకున్నారు.

IHG

 

కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి, సచిన్ టెండూల్కర్ స్పోర్ట్స్ ‌కు సంబంధించిన ఒక టీం దాంట్లో భాగస్వాములుగా కూడా ఉన్నారు వీరిద్దరూ. అయితే ప్రస్తుతం చిరంజీవి లాక్‌డౌన్ చేత కారణంగా పని లేకుండా పోయిన సినిమా వాళ్లకు సంబంధించి కరోనా క్రైసిస్ ఛారిటీ ( CCC ) సంబంధించిన పనులను ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అందిరికి సహకారం అందిస్తూ తెలుగు ప్రజలతో శబాష్ చిరు అనిపించుకొంటున్నారు. 


అయితే చిరు ఇక సచిన్ ని ఉద్దేశించి ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు దేశానికీ గర్వకారణం అంటూ మీరు యువతకి స్ఫూర్తి దాయకులు అంటూ చిరు తన సందేశాన్ని సచిన్ కు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: