క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేసిన వంద సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ కేవలం అతి తక్కువ కాలంలో ఆ రికార్డును అందుకుంటాడు అని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ తన అభిప్రాయాన్ని తెలిపాడు. కోహ్లీ తన నైపుణ్యం, ఫిట్నెస్, మానసిక బలంతో ఎలాంటి రికార్డులు ఐన బద్దలు కొడతాడని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక సచిన్ 16 సంవత్సరాల వయసులోనే పాకిస్థాన్ జట్టుపై తన అరంగ్రేటం చేసి ప్రపంచ గొప్ప క్రికెటర్ల లలో ఒకడు అయ్యాడు అని చెప్పుకొచ్చాడు.

 


అయితే తాజాగా ఆస్ట్రేలియా ప్లేయర్ బ్రెట్ లీ స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ లైవ్ షోలో మాట్లాడుతూ క్రికెట్ దేవుడు సచిన్ లో ఉన్న లక్షణాలు ఇప్పుడు కోహ్లీలో కనపడుతున్నాయని తెలిపాడు. అలాగే కోహ్లీకి ఎంతో నైపుణ్యం కలిగిన బ్యాట్స్ మెన్ అని తెలిపాడు. అన్నిటికంటే అతని ఫిట్నెస్ చాలా గొప్పదని తను మానసిక బలంతో కట్టిన మ్యాచ్ లలో, అలాగే విదేశాల్లో రానిస్తున్నాడు అని తెలిపాడు. అయితే సచిన్ ని దాటి వెళ్ళే సత్తా ఎవరికీ లేదని ఆయన క్రికెట్ దేవుడు అలాగే రికార్డులు మనం చూడడం తప్ప ఏమి చేయలేమని తెలిపాడు. అయితే కోహ్లీ ఇప్పుడున్న ఫామ్ ను కొనసాగిస్తే మరో ఏడు, ఎనిమిది సంవత్సరాల్లో వంద సెంచరీల రికార్డును సాధిస్తాడని చెప్పాడు. 

 


ఇక సచిన్ టెండూల్కర్ విషయానికొస్తే... ఆయన 200 టెస్టుల్లో 15921 పరుగులు చేయగా ఇందులో 51 సెంచరీలు ఉన్నాయి. అలాగే వన్డేల్లో 49 సెంచరీలు చేశాడు. దీనితో తన 100 సెంచరీలు సాధించిన ఏకైక వ్యక్తిగా రికార్డులో ఉన్నాడు. అయితే ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే... తను 86 టెస్టులో 27 శతకాలతో, 248 వన్డేల్లో 43 సెంచరీలతో మొత్తంగా 70 సెంచరీలు చేసి ఉన్నాడు. అయితే ఇదే కార్యక్రమంలో ఏ బౌలర్ కి మీరు భయపడతారని ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని అడగగా అందరిని అని సమాధానం ఇచ్చాడు. నిజానికి నేను బ్యాటింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క బౌలర్ కు భయపడేవాడిని ముఖ్యంగా స్పిన్నర్ లకు కూడా భయపడే వాళ్ళు అని చెప్పుకొచ్చాడు. ఇక ముఖ్యంగా షోయబ్ అక్తర్ బౌలింగ్ కు చాలా భయపడేవాడేనని అతను బౌలింగ్ చేస్తుంటే నన్ను చంపడానికి బౌలింగ్ చేస్తున్నాడేమో అన్నట్లు అనిపించేదని తెలిపారు. అయితే ఆస్ట్రేలియా తరఫున బ్రెట్ లీ 76 టెస్టుల్లో 310 వికెట్లు, 221 వన్డేల్లో 381 వికెట్లు తీశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: