ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం క్రికెట్ లో తిరుగులేని వ్యక్తిగా కోహ్లీ సాగుతుండడం అందరికీ తెలిసిన విషయమే. అయితే టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ తెలుపక వచ్చాడు. కరోనా కారణంగా ప్రభుత్వం పాకిస్థాన్ లో లాక్ డౌన్ విధించడంతో పాకిస్తాన్ ప్లేయర్లందరూ కూడా వారి ఇంట్లోనే గడుపుతున్నారు. అయితే పాకిస్తాన్ ప్లేయర్ మహమ్మద్ అమీర్ తన అభిమానులతో సోషల్ మీడియాలో బాగా టచ్ లో ఉంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బెస్ట్ బ్యాట్స్మెన్ గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆ పాకిస్తాన్ ప్లేయర్ కోహ్లీ అని సమాధానం చెప్పుకొచ్చాడు.


ఇక అసలు విషయానికి వస్తే ఒక అభిమాని మహమ్మద్ అమీర్ ను మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు అని ప్రశ్నించగా అతడు ఓవరాల్ గా పాకిస్తాన్ నుంచి నా ఫేవరెట్ ప్లేయర్ షాహిద్ అన్వర్ అని తెలపగా, అయితే ప్రస్తుత జనరేషన్ లో మాత్రం విరాట్ కోహ్లీ అని సమాధానమిచ్చాడు. అంతేకాదు కోహ్లీ బెస్ట్ బ్యాట్స్ మెన్ అని, అతనికి పోటీ ప్రస్తుత కాలంలో ఎవరూ లేరని తెలిపాడు.


అయితే 2010 సంవత్సరంలో ఇంగ్లండ్ పర్యటనలో ఫిక్సింగ్ కారణంగా మహమ్మద్ అమీర్ పై అప్పట్లో ఐదు సంవత్సరాల నిషేధం పడింది. దీనితో అతని కథ ముగిసిపోయిందని అందరూ ఊహించారు. కానీ 2016 ఆసియా కప్ తో మళ్ళీ తన రీ ఎంట్రీని ఘనంగా చాటాడు. ప్రస్తుతం ప్రపంచంలో అగ్రశ్రేణి బౌలర్లలో మహమ్మద్ అమీర్ కూడా ఒకడని చెప్పవచ్చు. అయితే ఇటీవల అమీర్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం 28 సంవత్సరాలలోనే టెస్టులకు వీడ్కోలు చెప్పాల్సిన అవసరం ఏముంది అంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు పెద్ద ఎత్తున తనపై విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ టీం గురించి ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం స్వార్థపూరితంగా తన రిటైర్మెంట్ ప్రకటించాడని అతనిపై ఆరోపణలు అప్పట్లో చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: