గత దశాబ్దంలో ప్రపంచంలోనే భీకరమైన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో తీస్తే అందులో పాకిస్తాన్ స్పీడ్ స్టర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ గా పిలవబడే షోయబ్ అక్తర్ పేరు కచ్చితంగా ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో క్రికెటర్లు అంతా ఇంస్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చి సరదాగా అభిమానులతో తమ అనుభవాలను పంచుకుంటుండగా షోయబ్ అక్తర్ కూడా ఇప్పుడు జాబితాలో చేరిపోయాడు.

 

మొదటిగా సచిన్ గురించి చెప్పిన అక్తర్.... సచిన్ మరియు ద్రవిడ్ ఇద్దరూ శాంత స్వభావులని మరియు వారికి భిన్నంగా కోహ్లీ మాత్రం భారతదేశం నుంచి వచ్చిన అతి తక్కువ మంది దూకుడు స్వభావం ఉన్న వారిలో ఒకడు అని అన్నాడు. ఇక సంవత్సరం టీ20 ప్రపంచ కప్ జరిగే పరిస్థితి అయితే లేదన్న అక్తర్ ఇప్పుడే భారత్ మరియు పాకిస్తాన్ మధ్య సిరీస్ పెట్టి సంబంధాలను మెరుగుపరుచుకుంటే చాలా గొప్పగా ఉంటుందని సూచించాడు.

 

ఇక నేటి తరం ఫాస్ట్ బౌలర్లు ఎక్కువ రోజులు ఆటలో కొనసాగాలంటే వారి ఫిట్నెస్ పై జాగ్రత్తగా ఉండాలని చెప్పిన అతను ఇప్పటివరకు ఐపీఎల్ మరియు వరల్డ్ కప్ లో తాను ఎటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ అనుభవాలను చూడలేదని అన్నాడు. ఇక భారత దేశ మాజీ కెప్టెన్ మరియు ప్రస్తుత బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి మాట్లాడుతూ గ్రెగ్ చాపెల్ లాంటి వివాదాస్పద కోచ్ నుండి విముక్తి పొందిన తర్వాత అతను చాలా గొప్పగా భారత క్రికెట్ ను ముందుకు నడిపించారని మరియు అతను బిసిసిఐ అధ్యక్షుడిగా ఎదిగిన తీరు చాలా అభినందనీయం అన్నాడు.

 

ధోనీ కచ్చితంగా తన చివరి మ్యాచ్ తీరాలని చెప్పిన షోయబ్... తనకు వ్యక్తిగతంగా రోహిత్ శర్మ అంటే చాలా ఇష్టం అని... నేరుగా రోహిత్ తోనే నీ టైమింగ్ ప్రపంచంలోనే ది బెస్ట్ అని చెప్పినట్లు కూడా వివరించాడు. ఇక సచిన్ ఎప్పుడూ స్లెడ్జింగ్ చేయలేదని మరియు అతను బ్యాట్ తోనే సమాధానం చెప్పేవాడు అని గుర్తు చేసుకున్న అక్తర్... కోహ్లీ స్లెడ్జింగ్ చేస్తే తాను బౌన్సర్ వేసి అతనిని ఔట్ చేస్తా అన్నాడు.

 

కోహ్లీ, విలియమ్సన్, రూట్, బాబర్ ఆజామ్ మరియు రోహిత్ శర్మ తన దృష్టిలో టాప్ ఫైవ్ బ్యాట్స్మెన్ అని చెప్పిన అక్తర్.... స్మిత్ మరియు షేన్ బాండ్ తన ఆల్ టైం ఫేవరేట్ అని చెప్పాడు. తను క్రికెట్ ఆడిన వారందరిలో డానియల్ మార్టిన్ కు బౌలింగ్ వేయడానికి తను చాలా కష్టపడ్డాడని చెప్పిన అక్తర్ అంతటితో లైవ్ ముగించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: