గత కొద్ది రోజులుగా టీమిండియాలో అత్యధిక సార్లు పేరు వినిపించిన బ్యాట్స్మెన్ లలో కె.ఎల్ రాహుల్ ఒకడు. నిజానికి గత రెండు సిరీస్ లలో తన వంతు పాత్రను పోషిస్తూ భారత విజయంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాడు. అయితే 2019 ప్రపంచ కప్ తర్వాత ధోని స్థానంలో వికెట్ కీపింగ్ చేయుటకు కేఎల్ రాహుల్ బెటర్ ఆప్షన్ అంటూ చాలామంది చెబుతూ వచ్చారు. అయితే అసలు ఇక అసలు విషయానికి వస్తే... టీమిండియాకు వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ ధోని స్థానాన్ని నువ్వు ఎప్పటికీ భర్తీ చేయలేవు అని క్రికెట్ అభిమానులు అంటారని భారత ఆటగాడు కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

 


నిజానికి కేఎల్ రాహుల్ తో పాటు రిషబ్ పంత్ కు కూడా అనేక అవకాశాలు ఇచ్చారు. కాకపోతే రిషబ్ పంత్ అవకాశాలను ఉపయోగించడంలో విఫలమవడంతో కేఎల్ రాహుల్ ని వికెట్ కీపింగ్ కి ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ అంశంపై ఒక ఛానెల్ తో రాహుల్ మాట్లాడాడు. నిజానికి కె.ఎల్. రాహుల్ ఐపీఎల్ తోపాటు కర్ణాటకకు ఆడేటప్పుడు కూడా వికెట్ కీపింగ్ చేస్తున్నానని కీపింగ్ బాధ్యతలు చేపట్టేందుకు ఎప్పుడూ నేను సిద్ధంగా ఉంటానని తెలిపాడు. కాకపోతే టీమిండియా కొరకు వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు కాస్త టెన్షన్ గా ఉంటుందని కేఎల్ రాహుల్ తెలిపాడు.

 


దీనికి కారణం ఒకసారి బంతిని పట్టడంలో తడబడినా నువ్వు ధోని స్థానాన్ని భర్తీ చేయలేవు అన్నట్లు ప్రజలు బాగా ఫీల్ అవుతారు అంటూ తెలిపాడు. నిజానికి ప్రపంచంలో దిగ్గజ వికెట్ కీపర్ అయిన ధోని స్థానాన్ని భర్తీ చేయాలంటే చాలా కష్టమని అలాగే ఒత్తిడితో కూడుకున్నదని ఆయన తెలిపాడు. అయితే వికెట్ల వెనుక మహేంద్ర సింగ్ ధోనీ తప్ప ఎవరు ఉన్న ప్రజలు పూర్తిగా అంగీకరించే పరిస్థితి లేదని కేఎల్ రాహుల్ చెప్పుకోచ్చాడు. అయితే ఈ సంవత్సరం జరగబోయే టి20 ప్రపంచకప్ కోసం నన్ను ఎంపిక చేసే విషయంలో, నేను ఐపీఎల్ లో చేసే ప్రదర్శన కూడా అవసరమని, బాగా చేయాలని ఆ ప్రదర్శన నాకు ఎంతో కీలకం అవుతుందని అభిప్రాయపడ్డాడు. కాకపోతే ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బకి ఐపీఎల్ వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: