కేన్ విలియమ్సన్... ఈయన గురించి తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుత న్యూజిలాండ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు, అలాగే ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి కూడా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయం. నిలకడతత్వం, ఖచ్చితత్వం ఈయన బ్యాటింగ్ లో బాగా ఆస్వాదించవచ్చు. అతని బ్యాటింగ్ శైలి ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి క్రీజ్ లో నిలదొక్కుకుని ఆ తర్వాత బౌలర్లపై విరుచుకుపడుతాడు కేన్ విలియమ్సన్.

 


ఇక అసలు విషయానికి వస్తే... న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ ఇద్దరు ఇంస్టాగ్రామ్ లైవ్ సెషన్ లోకి వచ్చి ముచ్చటించారు. అయితే ఈ లైవ్ సెషన్ లో అనేక విషయాలపై వారిద్దరూ మాటామంతి జరిపారు. ఇక ప్రస్తుతం జనరేషన్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మన్ ఏబీ డివిలియర్స్ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్ మెన్స్ అని న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. ఇందులో విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తున్నాడని నిజానికి కోహ్లీ ఆట చూసేందుకు చాలా అద్భుతం అని తెలియజేశాడు.

 


నిజానికి విరాట్ కోహ్లీ నుంచి చాలా నేర్చుకోవాలి అలాగే అందరికీ అత్యుత్తమ ప్రమాణాలు కోహ్లీ నిర్దేశించడం జరిగింది అని కేన్ విలియమ్సన్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. అయితే ఎబి డివిలియర్స్ ప్రస్తుతం కేవలం ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడని అందరికీ తెలిసినదే. అయితే ఆయన ఒక ప్రత్యేకమైన బ్యాట్స్ మెన్ అని వీరిద్దరితో పాటు చాలామంది నాణ్యమైన ఆటగాళ్లు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఆడుతున్నారని చెప్పుకొచ్చాడు.

అయితే కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ తరఫున ఏకంగా 80 టెస్టులోనే దాదాపు 51 బ్యాటింగ్ సగటుతో 6,479 పరుగులు చేశాడు. అలాగే ఏకంగా 151 వన్డేలో 6173 పరుగులు సాధించాడు. అయితే క్రితం సంవత్సరం ఇంగ్లాండ్ లో జరిగిన ప్రపంచ కప్ కు ఫైనల్ వరకు చేరుకొని దురదృష్టం వెంటాడడంతో టైటిల్ చేజారిన సంగతి అందరికి తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: