మేరీ కోమ్... భారత్లో క్రీడా అభిమానులకు ఈ పేరు సుపరిచితమే. నాలుగు పదుల వయస్సు దగ్గరికి వస్తున్న తనలో ఎలాంటి శక్తి తగ్గలేదు అని చెప్పి నిరూపిస్తూ ప్రపంచ పోటీల్లో తన సత్తా  ఎప్పటికప్పుడు తానేంటో నిరూపించుకుంటూ వస్తున్న మహిళా మేరీకోమ్.. ఆవిడ భారతదేశంలో సీనియర్ బాక్సర్. ఇప్పటికే ఒలంపిక్స్ లో ఒక పతకం కూడా సాధించిన ఘనత ఆమెకు చెందింది.

IHG

అయితే ఆమె తాజాగా కరోనా వైరస్ మహమ్మారి పై పోరాటం చేస్తున్న పోలీసులకు, డాక్టర్లకు, మున్సిపల్ సిబ్బందికి ఇలా ఎవరైతే వారికి సెల్యూట్ తెలిపింది. మేరీ కోమ్ ఆరు సార్లు ఛాంపియన్షిప్ గెలిచిన సంగతి అందరికి తెలిసిందే. ఈ విపత్కర పరిస్థితులలో ప్రాణాలను ఎక్కడ లెక్కచేయకుండా ఎదుటివారి కోసం వారి ప్రాణాలకి తెగించి పోరాడుతున్న వారికి సహకరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మేరీకోమ్ తెలిపింది.

IHG


మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకపోవడం మన తప్పే ప్రభుత్వం కూడా విస్తృతంగా ప్రచారం చేస్తుంది ఈ విషయంపై. ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి మార్గం మన చేతుల్లోనే ఉంది అంటూ ఆవిడ తెలియజేసింది.ఇక వైద్య సిబ్బంది పోలీసులు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మన కోసం పోరాటం సాగిస్తున్నారు అంటూ అలాంటి పోరాట యోధులకు నా సలాం అని తెలిపింది.

 

IHG

లాక్ డౌన్ కారణంగా క్రీడాకారులు అందరూ ఇంటిపట్టునే ఉండే అవకాశం దక్కింది. అయితే ప్రస్తుతం తాను సొంతంగా ప్రాక్టీస్ చేస్తున్నానని మేరీకోమ్ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: