బాలీవుడ్ పాపులర్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్(54)  ఈరోజు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ  తుది శ్వాస విడిచాడు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యనికి గురైన ఇర్ఫాన్  ఇటీవల లండన్ లో చికిత్స తీసుకున్నాడు. అయితే  కొద్దీ రోజుల క్రితం తన తల్లి మరణించడం వల్ల  మనోవేదన తో ఇర్ఫాన్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దాంతో అతన్ని హుటాహుటిన నిన్న ముంబై లోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చేర్పించగా ఈరోజు కన్నుమూశాడు. ఇక ఇర్ఫాన్ మృతికి కేవలం సినీ సెలబ్రెటీలు మాత్రమే కాకుండా భారత క్రికెటర్లు కూడా సంతాపం తెలియజేశారు. అందులో భాగంగా టీమిండియా కెప్టెన్  విరాట్ కోహ్లీ.. ఇర్ఫాన్ మరణ వార్త దిగ్బ్రాంతికి గురిచేసింది. ఇలాంటి  గొప్ప నటుడిని కోల్పోవడం బాధాకరం ..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి కోరుతున్నాని ట్వీట్ చేశాడు అలాగే మాయాంక్ అగర్వాల్ , మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా ఇర్ఫాన్ మరణం పై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.  
 
 
ఇక హిందీతోపాటు ఇంగ్లీష్ , తెలుగులో కూడా సినిమాలు చేసిన ఇర్ఫాన్ కు 2011లో పద్మశ్రీ అవార్డు లభించింది. తెలుగులో  మహేష్ బాబు నటించిన సైనికుడు లో విలన్ పాత్రలో మెప్పించాడు ఇర్ఫాన్.  ఆతరువాత మళ్ళీ మరో తెలుగు సినిమా చేయలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: