టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కంటే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ నజీర్ చాలా ప్రతిభావంతుడు అని ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇమ్రాన్ నజీర్ 1999 సంవత్సరంలో పాకిస్తాన్ జట్టులోకి వచ్చిన తర్వాత భారత్ పై ఒక మ్యాచ్లో విధ్వంసకర శతకం కొట్టాడు. దీనితో పాకిస్తాన్ తరపున నజీర్ తిరుగులేని క్రికెటర్ గా ఎదుగుతాడు అని ఆ దేశ మాజీ క్రికెటర్లు ఎన్నో అంచనాలు వేశారు. కానీ కొన్ని నెలల వ్యవధిలోనే అతని కెరీర్ గాడి తప్పడం జరిగింది. కేవలం ఎనిమిది టెస్ట్,  79 వన్డేలు, 25 టి - 20  మాత్రమే ఆడాడు. అయితే ఈ హిట్టర్ కేవలం 2822 పరుగులు మాత్రమే సాధించాడు. కాకపోతే వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్ పరంగా ఏకంగా 17 వేల పరుగులు పైన ఉన్న విషయం తెలిసిందే.

 


అయితే ఇక ఇమ్రాన్ నజీర్ కెరియర్ గురించి పాకిస్తాన్ మాజీ బౌలర్  షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ ఇమ్రాన్ నజీర్ కు వీరేంద్ర సెహ్వాగ్ కంటే ఎక్కువ ట్యాలెంట్ ఉంది అని తెలిపాడు. కానీ వీరేంద్ర సెహ్వాగ్ ఉండే బుర్ర లేదు అని కూడా చెప్పాడు. భారత్ పై ఒక శతకం కొట్టిన వెంటనే నజీర్ కు నేను నిలకడగా ఆడమని చెప్పానని కానీ అతను నా మాటలు పట్టించుకోలేదని దురదృష్టవశాత్తు అతని సేవలు పాక్ ఎక్కువకాలం వినియోగించ లేకపోయిందని షోయబ్ అక్తర్ తెలిపాడు. కాకపోతే నజీర్ వీరేంద్ర సెహ్వాగ్ కంటే మంచి ప్లేయర్ అని అలాగే మంచి ఫీల్డర్ అని కూడా అతను తెలిపాడు.

 


కాకపోతే బయట నిజానికి వీరేంద్ర సెహ్వాగ్, షోయబ్ అక్తర్ ల మధ్య చాలా కాలం నుండి ఆధిపత్య పోరు కొనసాగుతోంది. క్రికెట్ ఆడినన్నిరోజులు మైదానంలో బ్యాట్, బాల్ తో పోరాడిన ఇద్దరు ఇప్పుడు ఆటకు వీడ్కోలు చెప్పిన తర్వాత కూడా మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ విషయంలో షోయబ్ అక్తర్ మాట జారడం సినిమా దానికి కౌంటర్ ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: