రోహిత్ శర్మ.... ఈ పేరు ఇప్పుడు కేవలం పేరు మాత్రమే కాదు ఒక బ్రాండ్. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకంటూ సపరేట్ స్టైల్ ని ఏర్పరచుకొని టీమిండియాలో తన స్థానాన్ని చెక్కుచెదరకుండా నిలబెట్టుకున్నాడు హిట్ మాన్. తన కెరీర్ మొదట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి నిజానికి ఈ ఏడు సంవత్సరాల పాటు ఒడిదుడుకులను లోనయ్యాడు. మొదట్లో తన నిలకడ తత్వం లేకపోవడంతో 2011 ప్రపంచ కప్ కు తన పేరును సెలెక్ట్ చేయలేదంటే అప్పట్లో తన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అది ఎంతలా అంటే చివరికి రోహిత్ శర్మ లేకపోతే టీమ్ ని ప్రకటించలేని దుస్థితి లేనట్టుగా తయారయింది. దీనికి కారణం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి రోహిత్ శర్మ రాబట్టిన పరుగులు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్ గా ఉన్నాడు అంటే తన స్థానాన్ని టీమిండియాలో ఏవిధంగా సుస్థిరం చేసుకుంది సులువుగా అర్థం చేసుకోవచ్చు.

 


ఈరోజు తన 33 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు రోహిత్ శర్మ. ఏ బ్యాట్స్ మెన్ అయిన సరే వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాలని కలలు కంటాడు. కానీ రోహిత్ శర్మ దాన్ని రుజువు చేస్తూ ఏకంగా మూడు డబుల్ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో పరిమిత ఓవర్లలో 264 గా తన అత్యధిక స్కోర్ ని టాప్ స్కోరర్ గా నిలబెట్టుకున్నాడు. రోహిత్ శర్మ కేవలం టీమిండియాకు మాత్రమే హీరో కాదు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్. తన నాయకత్వ లక్షణాలను పూర్తిగా మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. దీనికి ఒకే ఒక రుజువు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కి నాలుగు టైటిల్స్ ని అందించడమే. టెస్టుల్లో ఓపెనర్ గా వచ్చి రెండింటిలోనూ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ రోహిత్ శర్మనే.

 


మరి ఇప్పుడు రోహిత్ శర్మ సాధించిన కొన్ని అరుదైన సంఘటన ఒకసారి చూద్దామా... మొదటగా వన్డే వరల్డ్ కప్ లో అత్యధిక సెంచరీలు (5), వన్డే వరల్డ్ కప్ చేంజింగ్ లో అత్యధిక శతకాలు (3), వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264), సిక్సర్లతో అన్ని ఫార్మాట్లలో సెంచరీ సాధించిన ఏకైక క్రికెటర్, టెస్టుల్లో ఓపెనర్ గా వచ్చి రెండు ఇన్నింగ్స్ లోనూ శతకం చేసిన మొదటి బ్యాట్స్ మెన్, 2013 నుంచి 2019 సంవత్సరం మధ్య కాలంలో ప్రతి క్యాలెండర్ ఇయర్లో వన్డే ఫార్మాట్లో 50కి పైగా సగటుతో తన బ్యాటింగ్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఓపెనర్ గా వచ్చి అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఏకైక భారత ఓపెనర్ రోహిత్ శర్మ. చివరగా " హ్యాపీ బర్త్డే టూ యు రోహిత్ శర్మ" .

మరింత సమాచారం తెలుసుకోండి: