మిథాలీ రాజ్... ఈ పేరు క్రికెట్ అభిమానులకు సుపరిచితం. దీనికి కారణం ఈవిడ భారత మహిళల టీమ్ లో అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతుంది కాబట్టి. అయితే ఈవిడ ఓ సందర్భంగా ఇన్ని సంవత్సరాలుగా ఒక ఐసీసీ టోర్నమెంట్ టైటిల్ ను కూడా సాధించకపోవడం చాలా నిరాశగా ఉందని ప్రస్తుత వన్డే కెప్టెన్ అయిన మిథాలీరాజ్ తెలిపింది. అయితే వచ్చే సంవత్సరంలో జరిగే ప్రపంచ కప్ లో మంచి ఆటను పరిచేందుకు ఇప్పటి నుంచి ప్రతి రోజు కష్టపడుతున్నాము అని ఆవిడ తెలిపింది. క్రికెట్ కామెంటేటర్ లీసా షలేకర్​తో మిథాలీ ఇన్​స్టాగ్రామ్ లైవ్ ద్వారా మిథాలీ రాజ్ ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది.

 


అంతేకాకుండా నేను, జులన్ గోస్వామి కలిసి చాలా సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నాము అని తెలిపింది. ఇప్పటి వరకు నాలుగు, ఐదు ప్రపంచ కప్ టోర్నీలో బరిలోకి దిగిన అయినాసరే ఐసిసి ట్రోఫీని కైవసం చేసుకోలేకపోయామని వాపోయింది. నిజానికి ఈ విషయం నాకు ఎంతగానో బాధ కలిగిస్తుందని తాను తెలిపింది. అయితే 2021 సంవత్సరంలో జరిగే ప్రపంచ కప్ లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తామని చెప్పుకొచ్చింది.

 


అంతేకాకుండా తరువాత జరిగే సిరీస్ లో పైన దృష్టి పెడుతున్నాం అని తెలిపింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మిథాలీ రాజ్, సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి ఇప్పటికే టి 20 నుంచి రిటైర్ అవ్వగా కేవలం వన్డే పైనే పూర్తి దృష్టి సాధించారు. వచ్చే సంవత్సరం న్యూజిలాండ్ దేశంలో జరిగే వన్డే ప్రపంచ కప్ గెలవాలనే లక్ష్యంతో సాధన చేసుకున్నామని తెలిపింది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో జూన్ నెలలో జరగాల్సిన ఇంగ్లాండ్ పర్యటన కాస్త వాయిదా పడింది. ఈ సంవత్సరం జరిగిన T 20 వరల్డ్ కప్ లో హర్మన్ ప్రీత్ సింగ్ సారథ్యంలో భారత మహిళల జట్టు ఫైనల్ వరకు చేరిన సంగతి తెలిసిందే. అయితే ఫైనల్లో భారీ ఓటమి తో కప్పుని సాధించలేకపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: