ఐపీఎల్ వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులకు మరింత  వినోదం  దొరుకుతుంది అన్న విషయం తెలిసింది. వరల్డ్ కప్ ని మించిన మజా భారత ప్రేక్షకులకు ఐపీఎల్ లో దొరుకుతుంది. ఎందుకంటే అప్పటివరకు జట్టుగా ఆడిన ఆటగాళ్లందరూ ఐపీఎల్ వచ్చిందంటే చాలు ప్రత్యర్ధులుగా మారిపోతారు. నువ్వా నేనా అన్నట్లు గా తలపడుతూ ఉంటారు. ఇక భారత ఆటగాళ్లకు విదేశీ ఆటగాళ్లు తోడైతే ఆ ఆట మరింత రసవత్తరంగా మారిపోతూ ఉంటుంది. అయితే ఐపీఎల్ కేవలం ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే  కాదు... ఎంతో మంది ఆటగాళ్ల భవితవ్యాన్ని కూడా తేలుస్తూ ఉంటుంది. చాలామంది ఐపీఎల్లో సత్తా చాటి తుది జట్టులో స్థానం సంపాదించాలని కుతూహలంతో ఎంతో కష్ట పడుతూ ఉంటారు. 

 

 

 అయితే ఐపీఎల్ జరిగేందుకు ఇంకొన్ని రోజుల సమయం ఉంది అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న అభిమానులందరికీ కరోనా వైరస్ ప్రభావం కారణంగా తీవ్ర నిరాశ ఎదురైంది అన్న విషయం తెలిసిందే. మార్చి 31వ తేదీన మొదలు కావాల్సిన ఐపిఎల్ కాస్త కరోనా  వైరస్ ప్రభావం తో దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో వాయిదా పడింది. ఇక ఏప్రిల్ 15 తర్వాత ఐపీఎల్ నిర్వహించాలని నిర్వాహకులు అనుకున్నప్పటికీ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్  పొడగించడంతో ఐపీఎల్ మరోసారి వాయిదా పడింది. అసలు ఐపీఎల్ కి ఈ ఏడాది జరుగుతుందా లేదా అనుమానం కూడా చాలామందిలో ఉంది. ఎందుకంటే దేశంలో రోజురోజుకీ  వైరస్ ప్రభావం పెరిగిపోతుంది. 

 

 

కానీ ఎక్కడా తగ్గుముఖం పట్టకపోవడంతో ఐపీఎల్ జరిగే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని ఈ ఏడాది ఐపీఎల్ రద్దు  ఖాయం అనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణపై అభిమానులూ ఇంకా ఆ ఆశతోనే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా మైటీమ్ 11 సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో  60 శాతం మంది ప్రేక్షకులు ఈ ఏడాది ఐపీఎల్ తప్పకుండా జరుగుతుంది అని నమ్మకం వ్యక్తం చేస్తూ ఓటు వేశారు... మరో 40 శాతం మంది ప్రేక్షకులు ఈ ఏడాది ఐపీఎల్ రద్దు అయినట్లే అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఐపీఎల్ జరుగుతుంది అన్న వారిలో 13 శాతం మంది మాత్రం ఎలాంటి  ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఐపీఎల్ విషయంలో బీసీసీఐ  ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదో .

మరింత సమాచారం తెలుసుకోండి: