పిల్లల చదువుకు, కరోనా వైరస్ కట్టడి కోసం సౌత్ ఆఫ్రికా మాజీ బ్యాట్స్ మెన్ హర్షెల్లే గిబ్స్ ముందుకు వచ్చాడు. దీనికి గాను వన్డే చరిత్రలో సరికొత్త రికార్డు రాసిన 435 పరుగుల ఛేదన మ్యాచ్ ‌లో తాను వాడిన బ్యాట్ ‌ని ఫండ్స్‌ కోసం వేలానికి పెట్టాడు. అయితే మార్చి 12, 2006 సంవత్సరంలో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మధ్య ఆ మ్యాచ్ జరిగింది. ఇందులో గిబ్స్ 175 పరుగులను 111 బంతుల్లో (21x4, 7x6) భారీ సెంచరీని సాధించాడు. దానితో ఆ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ఒక బంతి మిగిలి ఉండగానే విజయాన్ని సాధించింది.

 


ఇక ఆ మ్యాచ్ ‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలు ముగిసేసరికి కేవలం 4 వికెట్ల నష్టానికి 434 పరుగులు చేయగలిగింది. ఇక ఆ టీమ్‌ లో అప్పటి కెప్టెన్ రికీ పాంటింగ్ 164 పరుగులు 105 బంతుల్లో (13x4, 9x6) శతకం చేయగా, ఇంకా టీంలో హస్సీ 81 పరుగులు, కటిచ్ 79 పరుగులు, గిల్‌క్రిస్ట్ 55 పరుగులతో హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఇక అప్పటికి వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు అవ్వగా, ఇక కేవలం 3 గంటల వ్యవధిలోనే ఆ రికార్డుని సౌత్ ఆఫ్రికా బ్రేక్ చేసింది.

 

 

ఇక సౌత్ ఆఫ్రికా జట్టు 435 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గిబ్స్ ‌తో పాటు అప్పటి సౌత్ ఆఫ్రికా టీమ్ కెప్టెన్ గ్రేమ్ ‌స్మిత్ 90 పరుగులు 55 బంతుల్లో (13x4, 2x6) తో బ్యాట్ ను ఝళిపించాడు. దానితో రెండో వికెట్ ‌కి ఏకంగా 187 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. ఇక ఆఖర్లో సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ బౌచర్ 50 పరుగులు నాటౌట్ తో దూకుడుగా ఆడాడు. దీనితో ఒక బాల్ మిగిలి ఉండగానే అనగా  49.5 ఓవర్లలో 438/9తో సౌత్ ఆఫ్రికా విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ ఇప్పటికీ వన్డేల్లో అత్యధిక ఛేజింగ్ స్కోరుగా ఆ మ్యాచ్ రికార్డుల్లో అలానే ఉంది. ఇక ఆ మ్యాచ్ ‌లో దాదాపు 43 నిమిషాలు క్రీజులో ఉన్న మిస్టర్ 360 AB డివిలియర్స్ కేవలం 14 పరుగులు 20 బంతుల్లో (1x4) నిరుత్సహ పెట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: