వివిఎస్ లక్ష్మణ్... ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి కారణం ఆయన టీమిండియాలో సాధించిన పరుగులు. అలాగే ఆయన మణికట్టు ఆట తీరు. ప్రపంచంలో అందరికంటే మణికట్టును బాగా ఉపయోగించి అద్భుత షాట్లను ఆడగల ఆటగాడు ఎవరు అంటే ఒకే ఒక్క పేరు వీవీఎస్ లక్ష్మణ్. ఒక్కసారి వివిఎస్ లక్ష్మణ్ క్రీజ్ లో కుదురుకున్నాడు అంటే ఇక అంతే... అవతల ఎవరైనా సరే తన మణికట్టు బ్యాటింగ్ స్టైల్ తో బాల్ ను సునాయాసంగా బౌండరీ లైన్ దాటించ గల వ్యక్తి ఆయన.


ఇక అసలు విషయానికి వస్తే... టెస్ట్ క్రికెట్ లో అందరికంటే టెక్నికల్ పరంగా భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ఒక అడుగు ముందు ఉంటాడని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ తెలిపాడు. ఆస్ట్రేలియా జట్టు పేరు చెబితేనే ఎందుకు అలా రెచ్చిపోతాడో తెలియదు కానీ, వివిఎస్ లక్ష్మణ్ ఆస్ట్రేలియా జట్టుపై ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ లను ఆడిన విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయం కారణంగా ఆస్ట్రేలియా మాజీలు వీవీఎస్ లక్ష్మణ్ ని ముద్దుగా " వెరీ వెరీ స్పెషల్ " అని పిలుస్తారు.


బ్రెట్ లీ మాట్లాడుతూ నిజానికి లక్ష్మణ్ టెక్నిక్ అమోఘం అలాగే అతడి డిఫెన్స్ ను చేదించి తన వికెట్ పడగొట్టాలి అంటే చాలా కష్టమైన పని అని తెలిపాడు. దానికోసం తన బ్యాటింగ్ స్టైల్ కంటే స్పెషల్ గా తాము బౌలింగ్ చేయక తప్పదు అని ఆయన తెలిపాడు. అంతేకాకుండా వివిఎస్ లక్ష్మణ్ క్రీజ్ లో ఉన్నంత సేపు అతని పాదాల కదలిక, అలాగే మణికట్టు మాయాజాలం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అని తెలిపాడు. నిజానికి వివిఎస్ లక్ష్మణ్ ఒకసారి కుదురుకున్నాడు అంటే ఎదురుగా బౌలింగ్ చేస్తున్నది ఇది ఏ బౌలర్ అయినా సరే ఆ విషయాన్ని పక్కన పెట్టి తను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు అని ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: