సునీల్ ఛెత్రీ... నిజంగా ఈ పేరు చాలామందికి క్రీడా అభిమానులకు తెలియకపోవచ్చు. నిజానికి ఈయన ఎవరో తెలుసా...? ప్రస్తుత భారత ఫుట్ బాల్ జట్టు కెప్టెన్. మనదేశంలో క్రీడారంగం అంటే కేవలం క్రికెట్ అనేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆయన పేరు ఎక్కువ తెలియదు అని చెప్పవచ్చు. సునీల్ ఛెత్రీ... ఈ వ్యక్తి కేవలంఫుట్ బాల్ ప్లేయర్ కాకుండా ఒక మనసు ఉన్న వ్యక్తిగా కూడా. దేశంలో ఫుట్ బాల్ క్రీడను కాపాడటానికి సునీల్ ఛెత్రీ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు అని చెప్పవచ్చు. దీనికి కోసం భారత్ లో ఫుట్ బాల్ ప్రీమియర్ లీగ్ కు జరుగుతున్న సమయంలో ఈయన మాట్లాడిన మాటలు అద్దం పడతాయి. భారత్ లో కేవలం క్రికెట్ క్రీడ ఒక్కటే కాదని మిగితా క్రీడలను ఆదరించాలని ఆయన తెలిపాడు.

 

అయితే ఇక అసలు విషయానికి వస్తే... ప్రస్తుతం భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ తన అభిమానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కరోన కారణంగా ప్లేయర్లందరూ ఇంటికే పరిమితం కావడంతో కోల్కత్తా కు చెందిన ఒక అభిమాని సరదాగా ఫేస్ బుక్ లో సునీల్ ను ఒక వింత కోరిక కోరాడు. అదేమిటంటే ఈ లాక్ డౌన్ ముగిసేవరకు మీ నెట్ ఫ్లిక్ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఇవ్వమని అందులో అడిగాడు. అయితే దీనికి  సునీల్ ఒకింత ఆశ్చర్యపోయాడు అని చెప్పవచ్చు. ఈ విషయాన్ని సునీల్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. అయితే ఇది ఇలా ఉండగా  సునీల్ చేసిన పోస్ట్ కు నెట్ ఫ్లిక్ ఇండియా వెంటనే స్పందించింది.

 


అందులో సునీల్ మీ సంతకంతో కూడిన ఒక జెర్సీను మాకు కూడా పంపండి అంటూ నెట్ ఫ్లిక్ ప్రతినిధులు రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు సునీల్ మనం ఒక ఒప్పందానికి వద్దాం అంటూ ఒక సందేశం రాశాడు. అదేమిటంటే తన అభిమాని కోరికను మన్నిస్తూ అతనికి రెండు నెలల ఉచిత సబ్ స్క్రిప్షన్ ఇవ్వండి, నేను అప్పుడు మీకు జెర్సీ పంపుతాను అంటూ బదులు ఇచ్చాడు సునీల్ ఛెత్రీ. అయితే నెట్ ఫ్లిక్ సమ్మతితో ఆ అభిమానానికి సబ్ స్క్రిప్షన్ తో పాటు జెర్సీ కూడా లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: