టీమిండియాకు 28 సంవత్సరాల తర్వాత 2011 సంవత్సరంలో చివరి బంతిని సిక్స్ గా మలిచి ధోనీ గర్వంగా దేశానికి ప్రపంచ కప్ ను అందించాడు. ఇప్పటికీ, ఎప్పటికీ క్రికెట్ అభిమానులు ఆ దృశ్యాన్ని మాత్రం అభిమానుల గుండెల్లో చెక్కుచెదరకుండా ఉంటుంది. ఆ మ్యాచ్ మొదట్లో సెహ్వాగ్ తొందరగా అవుట్ అయిన మ్యాచ్లో తన వంతు సహకారంగా పరుగులు సాధించిన గౌతం గంభీర్ కూడా మనం తక్కువ చేయలేం. ఇక ఆ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ స్థానంలో వచ్చిన ధోని ఎలా ఆడాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ సీరియస్ మొత్తం అత్యంతంగా రాణించిన యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.


అయితే వీరందరూ ఒక ఎత్తు అయితే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరొక ఎత్తు. అప్పటి వరకు మొత్తం ఐదు వన్డే ప్రపంచ కప్ లు ఆడిన సచిన్ కు అది ఆరో ప్రపంచ కప్. అయితే సచిన్ చివరి మెగా టోన్ కూడా అదేనని అందిరికి తెలిసిన విషయమే. అయితే ఇన్ని సంవత్సరాల నిరీక్షణ ఈసారైనా తీరాలని ప్రతి భారతీయుడు కోరుకున్నారు. అయితే ఎట్టకేలకు సచిన్ కోరిక నెరవేరింది. ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకపై గెలిచి కప్పును టీమిండియా సొంతం చేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ, యువరాజ్ సింగ్, రైనా ఇలా అందరు ఆటగాళ్లు తమ భుజాలపై ఎత్తుకుని గ్రౌండ్ మొత్తం తిప్పారు.


అయితే ఇక తాజా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేష్ రైనా అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. సచిన్ లేకపోతే 2011 వరల్డ్ కప్ గెలిచే వాళ్ళం కాదని సురేష్ రైనా తెలిపాడు. నిజానికి మేము కప్ గెలవగలం అనే నమ్మకాన్ని ఆయనే మాలో నింపారని రైనా చెప్పుకొచ్చాడు. నిజానికి ఆయన లేకపోతే మేము కప్పు గెలిచే వాళ్ళం కాదు అని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: