ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీని కారణంగా ప్రపంచంలోనే అనేక రంగాల్లో కొంత కుంటు పడ్డాయని చెప్పవచ్చు. ఇదే విషయంలో క్రీడారంగం జోలికి వస్తే ప్రపంచంలో నలుమూలల జరిగే టోర్నీలో రద్దు అయ్యాయి అని చెప్పవచ్చు. ఇదే తరహాలో ప్రస్తుతం ఇండియాలో జరగాల్సిన క్రికెట్ మహా సంగ్రామం ఐపీఎల్ కూడా వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.


ఇక అసలు విషయానికి వస్తే... ఈ సంవత్సరం చివరిలో ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 వరల్డ్ కప్ కూడా సందేహంగానే ఉంది. అయితే ఈ విషయంపై ఆస్ట్రేలియా దేశ క్రీడా శాఖ మంత్రి రిచర్డ్ కోల్ బెక్ ఒక ప్రకటనను విడుదల చేశారు. టీ20 ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు ఇతర జట్టు క్రీడాకారులను తీసుకురావడం పెద్ద సమస్య కాదని ఆయన తెలిపారు. అయితే ప్రేక్షకులు లేకుండానే టోర్నీ నిర్వహిస్తే ఏమైనా దానికి విలువ ఉంటుందా లేదా అనే అంశంపై సోమవారం ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశాన్ని చర్చకు తెరలేపారు.


ఇక ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియా భారత్ మధ్య జరగవలసిన టెస్ట్ సిరీస్ ఆగిపోకూడదు అని, అది జరగాలని నేను కోరుకుంటున్నానని ఆయన తెలిపాడు. ఏది ఏమైనా ప్రపంచ కప్ ను ఆపకుండా నిర్వహించాలని మేము ఆలోచిస్తున్నామని కూడా ఆయన తెలిపాడు. దీనికోసం అన్ని జట్ల క్రీడాకారులను తీసుకురావడం పెద్ద సమస్య కాదని చెబుతూనే మ్యాచ్ లకు ప్రేక్షకుల హాజరు విషయంలోని ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా అంశాన్ని కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన తెలిపాడు. ఇదే విషయాన్ని ప్రపంచం మొత్తం ఆలోచిస్తుందని అని అన్నారు. ఇకపోతే ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా రాకపోతే అందరం చాలా నిరాశకు చెందుతాయని ఆ దేశ ఆటగాడు మార్నస్ లుబేసన్ మాట్లాడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: