కొన్ని సంవత్సరాల క్రితం టీమిండియా జట్టులో ఒక వెలుగు వెలిగిన క్రికెటర్ సురేష్ రైనా. ధోనీ నాయకత్వంలో ఉన్నప్పుడు రైనా అనేక మ్యాచుల్లో భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కాకపోతే నిలకడ లేమితో ఆటకు దూరం అయ్యాడు. 2018 సంవత్సరం జూలై నెలలో ఇంగ్లాండ్ లో చివరిసారిగా భారత్ తరఫున ఆడాడు. ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మాత్రం కీలక ఆటగాడి గానే సురేష్ రైనా తన ఫామ్ ని కొనసాగిస్తున్నాడు. ఇందుకు నిదర్శనం తన చివరి ఐపీఎల్లో 17 మ్యాచ్లు ఆడిన 383 పరుగులు చేశాడు. కాకపోతే ఏమైనా మళ్ళీ జట్టులో ఆడే ఛాన్స్ ఎందుకు రాలేదని మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు.

 


టీమిండియాకు దూరమైన సురేష్ రైనా తర్వాత దేశవాళి క్రికెట్ లో అడుగు పెట్టాడు. అయితే భారత జట్టుకు దూరమైన అక్కడ ఎంట్రీ ఇచ్చాడు అనుకుంటే అక్కడ కూడా చెప్పుకోదగ్గ గొప్ప ప్రదర్శన చేయలేదు. అంతేకాకుండా ఐపీఎల్ లోనూ పెద్దగా ప్రదర్శన చూపలేదు. ఎలాంటి మెరుపులు కూడా కనిపించలేదు. అయితే తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో సురేష్ ఆయన మాట్లాడుతూ ఒక సీనియర్ ప్లేయర్ ను జట్టు నుంచి తొలగించేటప్పుడు దానికి కారణం తెలపాలని అన్నాడు.

 


సీనియర్ ఆటగాళ్లు పట్ల సెలెక్టర్లు కాస్త బాధ్యతగా వ్యవహరించాలని ఈ రోజు అవకాశం వచ్చిందని అన్నాడు.. అయితే మోకాలి గాయం కారణంగా గత సంవత్సరం ఆగస్టు నెలలో నెదర్లాండ్స్ లో రెండోసారి సర్జరీ చేయించుకున్నాడు.. ఆ తర్వాత టీమిండియాకి తిరిగి రావాలని ఆయన ఆశ పడినప్పటికీ 2020 ఐపిఎల్ సీజన్ రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దినితో ఆయన ఆశలకు గండి పడినట్లే అయింది. అయితే మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ దేశవాళి ఫామ్ కారణంగా సురేష్ రైనా తిరిగి భారత జట్టులోకి ఎంపిక చేయలేదని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు. సీనియర్ ఆటగాళ్ల కు సంబంధించిన వరకు సెలెక్టర్లు బాధ్యత గానే ఉంటారు అని ఎమ్మెస్కే ప్రసాద్ తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: