టీమిండియా ప్లేయర్ సంజు శాంసన్ కు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ కు ఐపీఎల్ లో కలిసి ఆడే సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే స్టీవ్ స్మిత్ కు ఐపీఎల్ లో ఒక ముద్దు పేరు ఉందని సంజు శాంసన్ తెలిపాడు. వీరిద్దరూ కలిసి ఒకే టీంకు ఆడడం వలన ఈ విషయాన్ని సంజు శాంసన్ తెలిపాడు.

IHG's Called 'Chachu'
ఐపీఎల్ జరుగుతున్న సమయంలో మేమందరం చాచూ అని పిలుస్తామని శాంసన్ తెలియజేశాడు. అయితే ఆ పేరును మేము పెట్టలేదని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ అని శాంసన్ తెలియజేశాడు.మొదట్లో బ్రాడ్ హాగ్ స్మిత్ ను ఇలాగే పిలిచేవాడిని ఆ తర్వాత కూడా అలాగే పిలుస్తున్నామని శాంసన్ తెలియజేశాడు.


ఇక కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఈ సంవత్సరం జరగాల్సిన ఐపీఎల్ 13 సీజన్ రద్దు అవ్వడంతో క్రికెటర్లు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ ఆటగాడు అయిన స్పిన్నర్ ఇష్ సోధితో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌ లో సందర్భంగా శాంసన్ ఆ ముద్దు పేరు విషయాన్ని బయట పెట్టాడు. అయితే మొదట్లో బ్రాడ్ హాగ్ స్మిత ను చాచూ అని పిలిచేవాడని తెలిపాడు. 


ఇక దీనితో అప్పట్నుంచి స్మిత్ ను కలిసినప్పుడల్లా అలానే పిలుస్తామని తెలిపాడు. అయితే స్మిత్ కూడా మమ్మల్ని చాచు అనే పిలుస్తారు అని తెలియజేశాడు. నిజానికి స్మిత్ కెప్టెన్సీ లో ఆడడం బాగా ఆశ్వాదించ అని తెలిపాడు. అంతేకాకుండా స్మిత్ ను ప్రస్తుత క్రికెట్లో అతడు ఒక మేధావి అని శాంసన్ తెలియజేశారు. సంజు శాంసన్, స్మిత్ వీరిద్దరూ IPL లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: