హర్భజన్ సింగ్... టీమిండియా వెటరన్ స్పిన్నర్ గా ప్రపంచ క్రికెట్ కి చాలా రోజులు సేవలందించాడు. అలాగే ఇంటర్నేషనల్ మ్యాచ్ లకు గుడ్ బై చెప్పిన హర్భజన్ సింగ్ ఐపిఎల్ లో మాత్రం కొనసాగుతూనే ఉన్నారు. అయితే ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి హర్భజన్ సింగ్ ఆడుతున్నాడు. 

 


ఇకపోతే ఐపీఎల్ విషయానికి వస్తే.. హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే ప్రతి మ్యాచ్ భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లా ఉంటుందని తెలిపాడు. అయితే ఐపీఎల్ మొదలైనప్పుడు నుండి హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్ నుండి మాత్రమే ఆడుతున్నాడు. అయితే గత రెండు సీజన్ల నుండి చెన్నై సూపర్ కింగ్స్ టీం తరఫున ఆడుతున్నాడు. అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ నిర్వహించిన ఇంస్టాగ్రామ్ లైవ్ స్టేషన్ లో హర్భజన్ సింగ్ పాల్గొన్నాడు. ఇందులో బజ్జి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

 


పది సంవత్సరాలుగా బ్లూ జెర్సీ ధరించి ఆ తర్వాత వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ ధరించేటప్పుడు చాలా కొత్తగా అనిపించిందని, ఇది నిజానికి కలనా? నిజమా? అని నేను ప్రశ్నించుకొనే వాడిని తెలిపాడు. ముంబై టీం కు ఆడుతున్నప్పుడు CSK తో మ్యాచ్ జరిగినప్పుడల్లా భారత్ - పాక్ మ్యాచ్లో భావించే వాడినని బజ్జి తెలిపాడు. ఇకపోతే అకస్మాత్తుగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడటం చాలా కష్టంగా అనిపించింది. నాకు అది కూడా నా తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ తోనే ఆడటం నేను అదృష్టంగా భావించాలి అని తెలిపాడు. మామూలుగా కొత్త టీమ్ లో ఆడాలంటే కష్టంగా ఉంటుందని కానీ నేను CSK కి చాలా త్వరగా అలవాటు పడ్డానని తెలుపక వచ్చాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్టులో నీకు ఫేవరెట్ ఏది అని అడిగిన ప్రశ్నకు కాస్త ఇబ్బంది పడిన తనకు ముంబై ఇండియన్స్ జట్టు అని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: