ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే  సినీ క్రీడా రంగం ప్రముఖులందరూ ప్రస్తుతం ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియా ను ఎక్కువగా వాడేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ అయిన డేవిడ్ వార్నర్ కూడా సోషల్ మీడియాలో అభిమానులకు ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న యాప్ టిక్ టాక్ ద్వారా డేవిడ్ వార్నర్ తన డాన్స్ పర్ఫార్మెన్స్ ల తో అదరగొడుతు ఎంతో మందికి ఎంటర్టైన్మెంట్ పంపుతున్నాడు.

 

 

 ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ టాలీవుడ్ లోని అల్లుఅర్జున్ అల వైకుంఠ పురములో సినిమా సాంగ్ అయిన బుట్ట బొమ్మ అనే సాంగ్ కి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అదరగొట్టిన విషయం తెలిసిందే. ఇక విదేశీ ఆటగాడైనా డేవిడ్ వార్నర్ బుట్ట బొమ్మ సాంగ్ పై డాన్స్ చేయడంతో తెలుగు ప్రేక్షకులందరూ మురిసిపోయారూ  అనే చెప్పాలి. ఇక ఈ వీడియో టిక్ టాక్  లో వైరల్ గా మారిపోయింది. డేవిడ్ వార్నర్, అతని భార్య కూతురు అందరూ కలిసి బుట్ట బొమ్మ సాంగ్ పై డాన్స్ చేశారు. 

 

 

 అయితే తాజాగా వరల్డ్ బెస్ట్ ఓపెనర్ రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ లు ఇంస్టాగ్రామ్ వేదికగా ముచ్చటించుకున్నారు .  ఈ సందర్భంగా వారి మధ్య బుట్ట బొమ్మ సాంగ్ కి సంబంధించిన ప్రస్తావన రాగా... నీ బుట్ట బొమ్మ సాంగ్ డాన్స్ అదిరిపోయింది వార్నర్... సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది అటు వార్నర్ కి రోహిత్ శర్మ కితాబిచ్చాడు. అది టాలీవుడ్ పాట కదా అంటూ అడిగాడు. అయితే టాలీవుడ్ బాలీవుడ్ పాటలకు డాన్స్ చేయడం చాలా కష్టమని తెలిపాడు వార్నర్. హైదరాబాద్ అంటే తనకెంతో ఇష్టమని అక్కడి  అభిమానులు ఎంతో చురుగ్గా ఉంటారు అంటూ రోహిత్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: