ఐపీఎల్ వచ్చిందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులకు పండగ అని చెప్పాలి. అయితే ఐపీఎల్ మొదటి సీజన్ మొదలైనప్పటి నుంచి విజయవంతమైన జట్టుగా ఐపీఎల్ లో దూసుకుపోతున్న జట్టు ఏది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది చెన్నై సూపర్ కింగ్స్. భారత జట్టును ధోని ముందుండి నడిపిస్తున్న సమయంలోనే ఐపీఎల్ ప్రారంభ మైంది ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకు ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించాడు ధోని.  భారత జట్టు కెప్టెన్గా తప్పకున్నప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కు మాత్రం ధోని ఎప్పటికీ కెప్టెన్ అని ఫ్రాంచైజీ కూడా స్పష్టం చేసింది . చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో అలాంటి రికార్డ్ క్రియేట్ చేశాడు మహేంద్రసింగ్ ధోని. 

 

 

 అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ఇంస్టాగ్రామ్ లైవ్ స్టేషన్ లో  జట్టు ఆటగాళ్లు అందరూ తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ అయిన సురేష్ రైనా ఐపీఎల్ లో తన ఫేవరెట్ మూమెంట్ గురించి చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ అయినా మాథ్యూ హెడెన్ 2010లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా నలభై మూడు బంతుల్లో 92 పరుగులు చేసి విధ్వంసం సృష్టించారని... ఆ మ్యాచ్ లో  చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందని అదే తన ఐపీఎల్ తన ఫేవరేట్ మూమెంట్  అంటూ గుర్తు చేశాడు సురేష్ రైనా. ఇదే సమయంలో మాథ్యూ హెడెన్ కూడా ధోని తనకు ఇచ్చిన ఒక సలహా గురించి చెప్పుకొచ్చాడు. 

 

 

 ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ఆడిన మ్యాచ్ లో తాను మంగూస్  బ్యాట్  ఉపయోగించానని చెప్పుకొచ్చాడు. అయితే ఆ తర్వాత మంగూస్ బ్యాట్ ఉపయోగించవద్దు అంటూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని తనకు చెప్పాడు అన్న విషయాన్ని తాజాగా మాథ్యూ హెడెన్ చెప్పుకొచ్చాడు. నీ కోసం ఏమైనా ఇస్తా  కానీ ఆ బ్యాట్  మాత్రం వాడవద్దు అంటూ  ధోని సూచించాడని... అది ఎంతో రిస్కుతో కూడుకున్న అంశం కాబట్టి అలా సలహా ఇచ్చాడు అంటూ తెలిపాడు. నా ఫ్రాంచైజీని కష్టాల్లోకి నెట్టడం ఇష్టంలేక ధోని సూచనలు పాటించాను  అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ మ్యాచ్ లో  మంగోస్ బ్యాట్  ఉపయోగించలేదు కానీ ప్రాక్టీస్ సెషన్ లో మాత్రం ఆ బ్యాట్ తోనే  ప్రాక్టీస్ చేసేవాడిని అంటూ తెలిపాడు. అయితే ఈ మంగూస్ బ్యాట్ కి  పొడవైన హ్యాండిల్ వుండడంతో బంతిని ముందుగానే హిట్  చేసే అవకాశం ఉంటుందని.. అదే సమయంలో ఎక్కడ తేడా వచ్చిన  అవుట్ అవ్వక తప్పదు అంటూ తెలిపాడు. ఇదే విషయాన్ని ధోని ఒక మాటలో చెప్పడం తో తాను మంగూస్ బ్యాట్  వాడడం మానేశానని కానీ అంతకు ముందు చాలా మ్యాచుల్లో  మంగూస్ బ్యాట్ తో  ఆడి విజయవంతం అయ్యాను అంటూ మ్యాథ్యూ హెడెన్  చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: