జస్ప్రిత్ బూమ్రా... ప్రస్తుతం టీమిండియా తరఫున టాప్ బౌలర్. పరిమిత ఓవర్లలో ప్రపంచంలో అత్యంత బౌలర్లలో బుమ్రా ప్రస్తుతం కొనసాగుతున్నాడు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు అందరూ వారి వారి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక టోర్నమెంట్ అంటూ బయట తిరిగే వారు ఇప్పుడు ఇంట్లో ఉండి వారి కుటుంబ సభ్యులతో కాలాన్ని హాయిగా గడిపేస్తున్నారు.

 


ఇక టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో కీపింగ్ చేయడం చాలా కష్టమని ఆ విషయాన్ని వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. టీమిండియాలో కేఎల్ రాహుల్ కంటే ముందు రిషబ్ పంత్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే రిషబ్ పంత్ ఫామ్ ఆధారంగా తను జట్టులో కొనసాగలేక పోయాడు. దీనితో ఆ స్థానాన్ని కె.ఎల్.రాహుల్ తో భర్తీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ విషయంలో కేఎల్ రాహుల్ అత్యుత్తమ కీపర్ గా ఎదగడమే నా లక్ష్యం అని రాహుల్ తెలియజేశాడు. అయితే ఈ సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13 సీజన్ కంటిన్యూగా వాయిదా పడటంతో ఆటగాళ్లు వారి ఇళ్లకే పరిమితమయ్యారు.

 


అయితే ఈ క్రమంలోనే కొందరు ఆటగాళ్లు ఆన్లైన్లో కి వస్తున్నారు. తాజాగా కేఎల్ రాహుల్ ఇంస్టాగ్రామ్ లైవ్ లో ఆన్లైన్ లోకి వచ్చాడు. ఇకపోతే అందులో వికెట్ల వెనుక బూమ్రాను కాచుకోవడం చాలా కష్టం అని, అతడి బంతులు చాలా అనూహ్యంగా మీదికి వస్తుంటాయని తెలిపాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ లలో అత్యుత్తమ కీపర్ గా తాను ఎదగాలని అనుకుంటారని తన విషయాన్ని తెలిపాడు. అయితే 2016 సంవత్సరం ఐపీఎల్ తన కెరీర్ కు చాలా హెల్ప్ చేసింది అని తెలిపాడు. ఆ స్థాయి ఆటవల్ల నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అని కూడా తెలిపాడు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సూపర్ ఓపెనర్ అని కె.ఎల్.రాహుల్ తెలిపాడు. అతడితో కలిసి ఐపీఎల్లో బ్యాటింగ్ చేయడాన్ని పూర్తిగా ఆస్వాదిస్తానని అతను తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: