Ab డివిలియర్స్... ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే అతని బ్యాటింగ్ శైలి నచ్చని వారు ఉండరు. బాలు ఎటువైపు వేసిన సరే బౌండరీ అవతలికి పంపించే సత్తా ఉన్న బ్యాట్స్మెన్ ఈయన. అయితే ఈయన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తో పోల్చాడు. అలాగే ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తో పోల్చడం జరిగింది. అయితే విరాట్ కోహ్లీ తో పోలిస్తే స్మిత్ కాస్త మానసికంగా దృఢంగా ఉంటాడని తెలిపాడు. అంతేకాకుండా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీని బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకొచ్చాడు.

 


డివిలియర్స్ ఒక కామెంటేటర్ తో జరిగిన ఇంస్టాగ్రామ్ లైవ్ స్టేషన్ లో ఈ విషయాన్ని తెలిపాడు. నేను విరాట్ కోహ్లీతో కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కలిసి ఎనిమిది సంవత్సరాలుగా ఆడుతున్నామని అతని దగ్గర చాలా గమనించానని తెలిపాడు. ఇకపోతే కోహ్లీతో పాటు నాకు సచిన్ కూడా రోల్ మోడల్ అని తెలియజేశాడు. నిజానికి సచిన్ ఆడుతున్న సమయంలో అతని ఆట అద్భుతం అని తెలిపాడు. ఇకపోతే సచిన్ గురించి కోహ్లీ ఇంతకుముందు ఈ స్థాయిలో క్రికెట్ ను నిలబెట్టిన వారిలో ఒకటి అని చెప్పుకొచ్చాడు. ఇదే విషయం మీద అ డెవిలియర్స్ మాట్లాడుతూ సచిన్ కంటే కోహ్లీ ఈ విషయంలో ముందు ఉంటాడు అని తెలిపాడు. అంతే కాకుండా ఏదైనా మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే ఆ భారాన్ని మొత్తం కోహ్లీ మీద వేసుకుంటాడు అని కూడా తెలిపాడు. ఈ విషయంలో మాత్రం విరాట్ కోహ్లీకే నా ఓటు అని తెలియజేశాడు.

 

 

ఇక ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లను టెన్నిస్ దిగ్గజాలు ఫెదరర్, రఫెల్ నాదల్ తో పోల్చాడు. కోహ్లీ, స్మిత్ వీరిద్దరిలో కోహ్లీ ఎప్పుడు పరుగులు సాధించడం పైనే దృష్టి పెడతానని తెలిపాడు. ఇక వీరిద్దరి విషయంలో ఫేవరెట్ ఎవరని అడిగితే కోహ్లీకే తన ఓటమిని డివిలియర్స్ తెలిపాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ అత్యుత్తమ రన్ ఛేజర్ అని కూడా తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: