విరాట్ కోహ్లీ... ప్రస్తుత టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్. నిజానికి కొన్నిసార్లు విరాట్ కోహ్లీ చిన్నపిల్లాడిలా తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేడు. అయితే ఇదే కోవలోకి 2019 సంవత్సరంలో జరిగిన ఒక మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ విలియమ్స్ మధ్య జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. ఆ మ్యాచ్ లో ఒక సన్నివేశం వైరల్ వీడియో అయిన సంగతి అందరికీ తెలిసిందే. అదేమిటంటే విలియమ్స్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టి కోహ్లీ నోట్ బుక్ సెలబ్రేషన్ జరపడం అందరిలోనూ మంచి కిక్ ఇచ్చింది. కాకపోతే ఇది వెస్ట్ ఇండీస్ ఆటగాడు విలియమ్స్ స్టైల్. అయితే ఆ స్టైల్ ను కోహ్లీ ఎందుకు కాపీ కొట్టాడు అని ఒక ఇంటర్వ్యూలో విలియమ్స్ తెలిపాడు. 

 


ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... విలియమ్స్ ఆ రోజు జరిగిన మొత్తం సన్నివేశాన్ని తెలిపాడు. వెస్టిండీస్ లో ఇంతకుముందు విరాట్ కోహ్లీ వికెట్ తీసినప్పుడు మొదటిసారి నోట్ బుక్ సంబరాలు జరుపుకున్నారు అని తెలిపాడు. అది కేవలం అభిమానుల కోసమే అని కూడా చెప్పాడు. అయితే ఆ విషయాన్ని కోహ్లీ మాత్రం ఆ కోణంలో చూడలేదని మ్యాచ్ అయిపోయాక అతనికి షాక్ హ్యాండ్ ఇచ్చి నీ బౌలింగ్ బాగుంది అని తెలిపాడు. అయితే అది అంతటితో ముగిసిపోయింది అని తెలిపాడు.


ఇక అసలు విషయానికి వస్తే... గత సంవత్సరం విండీస్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు హైదరాబాదులో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో కోహ్లీ క్రీజులోకి వస్తూనే ఈ రాత్రిని నోట్ బుక్ సంబరాలకు నేను అవకాశం ఇవ్వనని తనతో చెప్పాడని తెలిపాడు. అంతేకాకుండా ప్రతి బంతికి ఏదో ఒకటి అంటూ నన్ను రెచ్చగొట్టడం కూడా తెలిపాడు. దీనితో నేను ఫ్రెండ్ నోరు మూసికొని బ్యాటింగ్ కొనసాగించు, నీ ప్రవర్తన చిన్నపిల్లవాడిలా ఉంది అని కూడా చెప్పాను విలియమ్స్ తెలిపాడు. కాకపోతే కోహ్లీ నేను చెప్పిన దాంట్లో సగమే విన్నారని విలియమ్స్ తెలిపాడు. అయితే ఇక ఆరోజు నన్ను లక్ష్యంగా చేసుకొని విరాట్ కోహ్లీ రెచ్చిపోయిన సంగతి తెలిసినదే. తన తలపై నుంచి భారీగా కొట్టిన సిక్సర్ తర్వాత విరాట్ కోహ్లీ నోట్ బుక్ సెలబ్రేషన్స్ ను చేసిన సంగతి ఇంకా భారత అభిమానులు మర్చిపోలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: