క్రికెట్ లో దిగ్గజ ఆటగాడు అయిన మహేంద్ర సింగ్ ధోనీకి క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్ కు సాధ్యం కాని రెండు ప్రపంచ కప్ లు  సాధించిన భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ. వికెట్ల వెనకాలే ఉంటూ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల సత్తా  ధోని సొంతం. అయితే ప్రస్తుతం తన కెరీర్ గురించి గత కొన్ని రోజులుగా ఏవో వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ధోనీ రిటైర్మెంట్ కు సంబంధించిన వార్తలు అయితే  తెగ  హల్ చల్ చేస్తున్నాయి. 

 

 

 ధోని  త్వరలో రిటైర్మెంట్ ప్రకటించ పోతున్నాడు అంటూ గత కొన్ని నెలల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. లేదు ఐపీఎల్లో సత్తా చాటి మళ్లీ జట్టులోకి వచ్చి  ప్రపంచకప్ టైటిల్ భారత్ కి గెలిపించిన  తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని మరి కొంతమంది అంటున్నారు. ఐపీఎల్ కాస్త వాయిదా పడడంతో ఇక ధోనీ మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం లేదు అని ధోని కెరీర్ ముగిసిపోయిట్లే అని అంటున్నారు. విమర్శలు అన్నిటికీ కారణం గత ప్రపంచ కప్ లో ధోని తనదైన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడం. దీంతో ఇవన్నీ విమర్శలు వస్తున్నాయి. 

 

 

 అయితే ఎంతో మంది క్రికెట్ ప్రముఖులు కూడా ధోని రిటైర్మెంట్ పై స్పందిస్తూ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ధోని రిటైర్మెంట్ విషయాన్ని ఆయనకు వదిలేయాలని దీనిపై ఊరికే రాద్ధాంతం చేయొద్దని కొంతమంది అంటే ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా రకరకాల వార్తలు ధోని కెరీర్ పై  వస్తూనే ఉన్నాయి  ఇక తాజాగా ధోని కెరీర్ గురించి ధోని వయసు గురించి ధోని తల్లి స్పందించారు. నా బిడ్డకి ఇంకా వయసు అయిపోలేదు అని... క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ ధోని తల్లి తాజాగా వ్యాఖ్యలు చేయడం ధోని  అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: