రవి శాస్త్రి... ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా సాగుతున్న వ్యక్తి. ఈయన ఇంతకుముందు మన టీం ఇండియాకు సేవలందించిన టీమిండియా క్రికెటర్. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం తగ్గిన తర్వాత క్రీడారంగం తిరిగి మొదలైతే ముందుగా దేశవాళి, ద్వైపాక్షిక సిరీస్ లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇకపోతే గ్లోబల్ టోర్నమెంట్స్ కంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ టోర్నీలో నిర్వహణ చాలా మంచిదని ఆయన తెలిపారు. 


క్రికెట్ పట్టాలెక్కే క్రమంలో ఐసీసీ ప్రపంచకప్ కన్నా దేశవాళి క్రికెట్, ఐపీఎల్ లాంటి దేశవాళి క్రికెట్ టోర్నమెంట్ లు చాలా అవసరమని రవిశాస్త్రి అభిప్రాయం తెలియజేశారు. ఆయన ఇంటర్వ్యూ లో తెలిపిన విషయం ఏమిటంటే నేను ప్రస్తుతం ప్రపంచ టోర్నీలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వను. ముందుగా దేశీయ క్రికెట్ సాధారణ స్థితికి వచ్చేలా చూసుకోవాలి అని ఆయన తెలిపారు. దీనికోసం ముందుగా అంతర్జాతీయ ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు అందరూ మళ్లీ క్రికెట్ మైదానంలోకి తిరిగి రావాలని తెలిపాడు.


ఇలాంటి పరిస్థితుల్లో ఒక జట్టు ఇతర దేశాలకు వెళ్లి ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే కేవలం ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం చాలా మేలు. దీనికి కారణం ఏదైనా ఒక దేశం మాత్రమే ఇంకో దేశానికి వెళ్లి క్రికెట్ ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే అదే ప్రపంచ కప్ ఆడాల్సి వస్తే... అనేక దేశాలు ఒక దేశానికి వెళ్లి అక్కడ క్రికెట్ ఆడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నేను కేవలం దేశీయ క్రికెట్ కు, ఐపీఎల్ లాంటి వాటికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తాను అని రవి శాస్త్రి తెలిపారు. అయితే ఇంతకాలం క్రికెటర్లు అందరూ సమయం తీసుకోవడంతో వారు గాడిలో పడాలంటే మరికొంత సమయం పడుతుందని హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ సందర్భంగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: