ఎంఎస్ ధోని... ఈయన గురించి ఎంత చెప్పిన తక్కువే. ప్రపంచంలో బెస్ట్ ఫినిషర్ అంటే ఇంతకు ముందు ఆస్ట్రేలియా ఆటగాడు మైకేల్ బెవన్ పేరు చెప్పేవారు, ఆ తరువాత చెప్పే ఒకేఒక్క పేరు మహేంద్ర సింగ్ ధోని మాత్రమే. అది అతని స్టామినా... మ్యాచ్ కు ఫినిషింగ్ ఇవ్వ‌డంలో ఎంఎస్ ధోని రేంజ్ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాని ఆ విష‌యంలో ధోనీ స్టయిలే వేరని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లిసిస్ మహిని ప్రశంసల జల్లులో ముంచెత్తాడు. 


ఇక ఐపీఎల్ ‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ధోనీ కెప్టెన్సీ ఆధ్వర్యంలోనే చాలా కాలంగా ఆడుతూ వస్తున్న డుప్లెసిస్, ధోనీ బ్యాటింగ్ శైలిని తాను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో‌ ఐపీఎల్ - 2020 సీజన్ నిరవధికంగా వాయిదాపడిన విషయం అందరికి తెలిసిందే. ఇకపోతే ‘మైదానంలో ఉన్నంతసేపు ధోనీ చాలా సైలెంట్ గా ఉంటూనే... ఆ మ్యాచ్ కు ఊహ‌కంద‌ని విధంగా ఫినిష్ చేసే విధ్వంస‌క‌ర ఆట‌గాడ‌ని నేను చూడలేదు అని తెలిపాడు డుప్లెసిస్.


అంతేకూండా నేను నాన్‌స్ట్రైక్ ఎండ్‌ నుంచి ధోనీ బ్యాటింగ్‌ ని చాలా ఎంజాయ్ చేస్తాను అని తెలిపాడు. మ్యాచ్ లో ప‌రిస్థితుల‌కు అనుగుణంగా అప్పటికప్పుడే ఒక ప్లాన్ ప్రకారం అతని ఆట వెళుతుందని,  ఎవరి బౌలింగ్ ‌‌ని టార్గెట్ చేయాలి..? ఇంకా అలాగే మిగితా విష‌యాలపై ధోనీకి పూర్తి క్లారిటీ ఉంటుంది అని చెబుతూనే, ఇకపోతే ఎవరైనా ధోనీ స్టయిల్‌లో ఎవ‌రైనా ఆడాలనుకున్నా.. ఫెయిలైపోతారు’’ అని డుప్లెసిస్ తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇక ఐపీఎల్ ‌మొదలైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ని లీడ్ చేస్తోన్న‌ ధోనీ.. చెన్నైకి ఇంతవరకు ఏకంగా మూడు ఐపీఎల్ టైటిల్స్ ‌ని అందించాడు. అంతేకాదు CSK ఆడిన ప్రతి సీజన్ ‌లోనూ జట్టుని కనీసం ప్లేఆఫ్ ‌కి చెరచడంటే అతని నాయకత్వం ఎలాంటిదో చెప్పచు అని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: