సచిన్ రమేష్ టెండూల్కర్.... ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరియర్ అమాంతం టీమిండియా విజయానికి కట్టుబడి క్రికెట్ ఆడిన వ్యక్తిగా, భారత క్రికెట్ దేవుడిగా సచిన్ ను భావిస్తారు. ఇక అసలు విషయానికి వస్తే.... ప్రపంచంలో లో మొదటి డబుల్ సెంచరీ చేసిన ఘనత సచిన్ కే చెందింది. 2010 సంవత్సరంలో సౌత్ఆఫ్రికా తో భారత్ లో జరిగిన మ్యాచ్ లో మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను సాధించి ప్రపంచాన్ని అబ్బుర పరిచాడు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ... సౌత్ ఆఫ్రికా బౌలర్ స్టెయిన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆరోజు అంపైర్ భయపడడం వలనే సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీని సాధించాడు అని అతను ఆరోపించాడు. తాజాగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ తో సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన స్టెయిన్ సంచలన విషయాలు తెలిపాడు.

 


ఆనాటి మ్యాచ్ లో ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్ అక్కడికి హాజరైన ప్రేక్షకులను చూసి భయపడ్డాడని తెలిపాడు. ఆ మ్యాచ్లో సచిన్ 190 పరుగులు చేసిన సమయంలో నేను తనని ఎల్బిడబ్ల్యు చేశానని కానీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడని తెలిపాడు. అయితే ఈ విషయంలో నేను ఏమి చేయలేక అంపైర్ వైపు చూడగా అతడి మొహంలో భయం బాగా కనబడుతుంది అని స్టెయిన్ తెలిపాడు.

 

ఆ సమయంలో లో నేను అంపైర్ వైపు " అవుట్ అయినా ఎందుకు నాట్ అవుట్ ఇచ్చావు " అన్నట్లు చూడగా, దానికి అంపైర్ " చుట్టూ జనాలను చూసావా...? సచిన్ ను ఔట్ ప్రకటిస్తే నన్ను ఇక్కడి నుంచి హోటల్ కు కూడా పోనివ్వరు " అనేలా నా వైపు చూసినట్లు అనిపించిందని స్టెయిన్ తెలిపాడు. ఇక ఆ మ్యాచ్లో సచిన్ కేవలం 147 బంతుల్లో 200 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడంతో ఇండియా ఆ మ్యాచ్లో 401 పరుగులు చేయగలిగింది. ఇక ఆ తరువాత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 153 పరుగుల తేడాతో ఓటమిపాలైంది

మరింత సమాచారం తెలుసుకోండి: