ప్రస్తుత టీమిండియా జుట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి విరాట్ కోహ్లీ. ఇకపోతే విరాట్ కోహ్లీ ప్రవర్తిస్తున్న తీరు సరిగా లేదని టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ తప్పు పట్టాడు. అయితే తాజాగా హలో యాప్ నిర్వహించిన లైవ్ సెషన్ ద్వారా కోహ్లీపై మహమ్మద్ కైఫ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.


ఇందులో ముఖ్యంగా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ విషయాన్నీ తెలుపుతూ విరాట్ కోహ్లీపై ఈ మాజీ క్రికెటర్ ఘాటుగానే విమర్శలు చేశాడు. జట్టు ఎంపిక విషయంలో కోహ్లీ చాలా ప్రయోగాలు చేస్తున్నాడని గత సంవత్సరం జరిగిన వన్డే ప్రపంచకప్ లో కూడా జట్టు సమతూకం కోసం చాలా ప్రయోగాలు చేశాడని తెలిపాడు. అయితే అలాంటి సమయంలో అనవసరం ప్రయోగాలకు బదులు కోహ్లీ యువ ఆటగాళ్లకు మద్దతుగా నిలవాలని సూచించాడు. ఎవరైనా కొన్ని మ్యాచ్ లలో వారి ఫామ్ కోల్పోతే ఆ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాలని, అలాంటి సమయంలో అవసరాలకు కావాల్సిన ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాలని అప్పుడు మాత్రమే మంచి జట్టు తయారు అవుతుందని మహమ్మద్ కైఫ్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.


ఇకపోతే టీమిండియాలో వికెట్ కీపర్ స్థానం గురించి మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ ప్రస్తుతం కె.ఎల్.రాహుల్ టీమిండియాకు బ్యాకప్ కీపర్ గా ఉండడమే మంచిదని తెలియజేశాడు. చివరకు వికెట్ కీపర్ స్థానంలో కూడా కోహ్లీ అనేకమార్లు ఆటగాళ్లను ప్రయోగించిందని తెలిపాడు. ధోని ని పక్కనపెట్టి రిషబ్ పంత్ కు మద్దతు ఇవ్వాలనుకుంటే మాత్రం అతనికి కోహ్లీ అండగా ఉంటూ సపోర్ట్ చేయాలని తెలిపాడు. అంతే కాకుండా అతను వాటర్ బాయిగా టీమిండియాకు స్థానాన్ని సంపాదించుకోలేదని మహమ్మద్ కైఫ్ విరాట్ కోహ్లీకి చురకలు అంటించాడు. ఇన్ని విషయాలు కోహ్లీ గురించి చెప్పినా మరోవైపు కోహ్లీ రిటైర్మెంట్ అయ్యేటప్పటికి ధోని కన్నా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అవుతాడని మహమ్మద్ కైఫ్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: