ధోని అభిమానులు వారి పవర్ ఏంటో మరోసారి చూపించారు. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ధోని ప్రెకషకులను సంపాదించుకున్నాడు. అలాంటిది ధోని ని ఎవరిపైన ఏమైనా అన్నా, చేదుగా మాట్లాడిన, తక్కువ చేసి మాట్లాడిన సరే ఇక వారు క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే. దానికి కారణం ధోని అభిమానుల అభిమానము అలాంటిది. ఇకపోతే ఇక అసలు విషయానికి వస్తే... భార‌త మాజీ క్రికెట‌ర్ ఆకాశ్ చోప్రా.. రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌న త‌ర్వ‌త క్రికెట్ కామెంటేట‌ర్ ‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి అందరికి తెలిసిందే. ఇకపోతే ఆయన తాజాగా త‌ను ఈ ఏడాదికి సంబంధించి జరగబోయే టీ20 ప్రపంచకప్ ‌లో ఆడబోయే భార‌త జ‌ట్టు అంచ‌నాను ప్ర‌క‌టించాడు. 

 

ఇక అంతే, ఈ టీమ్‌ను ప్ర‌క‌టించాక త‌ను విప‌రీతంగా ట్రోలింగ్ ‌కు గుర‌య్యానని ఆయన చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా MS ధోనీకి జ‌ట్టులో చోటు క‌ల్పించక‌పోవ‌డంతో అభిమానుల నుంచి భరించలేని ట్రోలింగ్ ఎదుర్కొన్న‌ట్లు ఆకాశ్ చోప్రా తెలిపాడు. ఇక ఈ జాబితాలో ధోనీ స్థానంలో వికెట్ కీప‌ర్లుగా కేఎల్ రాహుల్‌, రిష‌భ్ పంత్‌ను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇకపోతే ఈ టీమ్‌ను ప్ర‌క‌టించాక సోష‌ల్ మీడియాలో త‌న‌ను అనేకమంది విమర్శించారని, వాళ్లంతా కామెంట్లతో నాకు చుక్కలు చూపించినట్లు ఆకాశ్ గుర్తు చేసుకున్నాడు. ఇక వీళ్ల బాధ తాళ‌లేక కొంత‌కాలంపాటు సోష‌ల్ మీడియాకు త‌ను గుడ్ బై చెప్పిన‌ట్లు ఆయన తెలిపాడు. దానితో అనంత‌రం అభిమానుల‌కు సారీ కూడా చెప్ప‌డంతో పాటు జ‌రిగిన విష‌యాన్ని మ‌ర్చిపోవాల‌ని ఆయన అభ్య‌ర్థించాడు.

 
ఇక మ‌రోవైపు ఈ సంవత్సరం టీ - 20 వ‌ర‌ల్డ్ ‌క‌ప్ అక్టోబ‌ర్ నెల‌లో ఆస్ట్రేలియాలో షెడ్యూల్ ఉంది. ఇకపోతే క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఈ టోర్నీ నిర్వ‌హ‌ణ ప్ర‌మాదంలో ప‌డింది అని చెప్పవచ్చు. ఇక పోయిన సంవత్సరం వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ అయిపోయాక టీమిండియాకు ధోనీ దూరంగా ఉంటూనే ఉంటున్నాడు. అయితే గత కొద్దీ కాలంగా కొంత‌కాలంపాటు సైన్యంలో ప‌నిచేసిన ధోనీ.. ప్రైవేట్ కార్య‌క్ర‌మాల‌కు మాత్రమే  పరిమితమయ్యాడు. ఇంకోవైపు ఈ సంవత్సరం ఐపీఎల్ లో స‌త్తాను చాటి, తిరిగి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాల‌ని ధోనీ అనుకున్న.. ఇక అది క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఐపీఎల్ నిర‌వ‌ధికంగా వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: