ప్రపంచంలో ఇప్పుడు కరోనా పేరు చెబితే సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు గడ గడ వణికి పోతున్నారు.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ మాయదారి వైరస్ ప్రపంచాన్ని మొత్తం చుట్టేస్తుంది.  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 50 లక్షలు దాటిపోయింది.వైరస్ వ్యాప్తి మొదలైన తొలి రోజుల్లో చైనా, అమెరికా, ఐరోపా దేశాల్లో విలయతాండవం చేసిన ఈ మహమ్మారి ప్రస్తుతం అక్కడ క్రమంగా తగ్గుముఖం పడుతుండగా.. రష్యా, బ్రెజిల్‌లో మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తోంది. నిన్నమొన్నటి వరకు కోవిడ్‌తో విలవిల్లాడిన స్పెయిన్, ఇటలీ దేశాలు ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతుండగా, రష్యాలో కేసులు మూడు లక్షలు దాటాయి.

 

అయితే కరోనా భారిన పడి బతికి బయట పడ్డవారు చాలా అరుదుగా ఉంటున్నారు. కానీ కరోనా పూర్తిగా తగ్గినట్టు కాదని.. మళ్లి తిరగబడుతుందని కూడా అంటున్నారు.  తాజాగా అమెరికాకు చెందిన మైక్ షుల్జ్ అనే బాడీబిల్డర్ కూడా కొన్నివారాల కిందట కరోనా బారినపడ్డాడు. కాలిఫోర్నియాకు చెందిన షుల్జ్ కరోనా రక్కసితో సుమారు 6 వారాల పాటు పోరాడి విజయం సాధించాడు. అయితే, ఈ క్రమంలో ఏకంగా 23 కిలోల బరువు కోల్పోయాడు. తాాజాగా అతనికి చికిత్స అందించిన ఓ నర్సు అతని తాజాగా ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటో లను పోస్టు చేయడంతో అతని ఫాలోవర్లు విస్తుపోయారు.

 

ఎలా ఉన్న వ్యక్తి ఎలా మారియాడు బాబోయో.. కరోనా కు ముందు కరోనా తర్వాత పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందని భయపడిపోయారు. కరోనా సోకకముందు 86 కిలోల బరువున్న షుల్జ్ కోలుకున్నాక 63 కిలోల బరువు తూగాడు. దీనిపై సదరు బాడీబిల్డర్ వ్యాఖ్యానిస్తూ, ఈ ఫొటోలను తాను ప్రదర్శించడానికి కారణం, కరోనా ఎవరికైనా సోకుతుందని చెప్పడానికేనని పేర్కొన్నాడు. మనం ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దని ఆయన తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: