ప్రపంచం మొత్తం కరోనా దెబ్బకి విలవిల్లాడుతున్న సంగతి అందరికీ తెలిసినదే. గత వారం రోజుల నుండి దీని తీవ్రత ప్రపంచవ్యాప్తంగా మరీ ఎక్కువ అయ్యింది అని చెప్పవచ్చు. అయితే దీని దెబ్బకు ప్రపంచంలోని అన్ని రంగాలు దెబ్బతిన్నాయని చెప్పవచ్చు. అందులో క్రీడా రంగం కూడా పూర్తిగా దెబ్బతింది. ప్రపంచం మొత్తం ఎలాంటి క్రీడలు జరగకుండా పూర్తిగా నిలిపివేశారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే....


తాజాగా క్రికెట్ నిబంధనలని ఐసీసీ కఠినతరం చేసింది. ప్రస్తుతం కరోనా కారణంగా అనేక టోర్నీలు వాయిదా పడగా, మరికొన్ని రద్దు అయ్యాయి అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజా పరిస్థితి చూస్తుంటే జూన్ నుంచి మళ్ళీ క్రికెట్ సిరీస్ లు మొదలయ్యే సూచనలు కనబడుతున్నాయి. అయితే వీటి కోసం ఆటగాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే అంపైర్ నడవాల్సిన తీరు, మ్యాచ్ అధికారుల నియమావళి పై అంతర్జాతీయ క్రికెట్ సంఘం ప్రత్యేకంగా కొన్ని రూల్స్ ని తెర పైకి తీసుకువచ్చింది. అయితే ఈ క్రమంలో అభ్యర్థుల మధ్య ఉన్న చైన్ సైకిల్ రిలేషన్ ను పూర్తిగా తొలగించింది ఐసిసి.


అది ఎలా అంటే మామూలుగా ఒక ఓవర్ ముగిసిన తర్వాత ఫీల్డింగ్ చేస్తున్న జట్టు ఆ బంతిని అక్కడ ఉన్న అంపైర్ కు ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా వన్డే మ్యాచ్ లో అయితే రెండు బంతులను ఉపయోగిస్తారు. ఇక దీని కోసం ప్రతి ఓవర్ వేసేముందు స్ట్రైకింగ్ అంపైర్ చేతి నుంచి బౌలర్ బంతిని తీసుకోవాలి. ఇకపై క్రికెట్ మ్యాచ్ల్ లో ఇదే రూల్ కొనసాగుతుంది. ఇకపోతే క్రికెట్ మ్యాచ్లో అంపైర్లు గ్లోవ్స్ ను ధరించి మాత్రమే అని అందుకోవాల్సి ఉంటుంది. ఇక మరో కొత్త రూల్ గ్రౌండ్ లో ప్లేయర్స్ మాత్రమే కాకుండా అక్కడ ఉన్న అంపైర్స్ కూడా కనీసం ఒకటిన్నర మీటర్ డిస్టెన్స్ ను పాటించాలని ఐసీసీ ప్రతిపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: