గత కొంతకాలంగా భారతం క్రికెట్ సెలెక్టర్లు పై కొంతమంది మాజీ క్రికెటర్లు మరికొంతమంది ప్రస్తుత క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా 30 ఏళ్ళ వయస్సులోనే ఆటగాళ్లను ముసలి వాళ్లను చేసేస్తారు అంటూ వ్యాఖ్యానిస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. మొన్నటికి మొన్న టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ అయిన ఇర్ఫాన్ పఠాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విదేశాలలో ఆటగాళ్లు 30 ఏళ్ల వయసులో కూడా తమ  కెరీర్ ని ప్రారంభిస్తూ ఉంటే.. భారత్లో మాత్రం 30 ఏళ్లు రాగానే ఆటగాని ముసలాన్ని చేసి కూర్చోబెట్టడానికి సెలెక్టర్లు ప్రయత్నం చేస్తారు అంటూ వ్యాఖ్యానించడం  సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక తాజాగా హర్భజన్ సింగ్ సైతం దాదాపు అలాంటి వ్యాఖ్యలు చేసాడు. 

 


 టీమిండియాలో కీలక స్పిన్నర్ హర్భజన్ ఎన్నో మ్యాచుల్లో అద్భుతమైన స్పీచ్ తో అదరగొట్టిన విషయం తెలిసిందే. స్పిన్ మాయాజాలంతో ఎన్నో సార్లు మ్యాజిక్ చేశాడు హర్భజన్. అలాంటి గొప్ప స్పిన్నర్ పేరును  ప్రస్తుతం సెలెక్టర్లు కనీసం గత కొంతకాలంగా పరిశీలనలోకి కూడా తీసుకోవడం లేదు. ఇక సెలక్టర్ల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న హర్భజన్ సింగ్.. ఈ విషయాన్ని తాజాగా ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొన్నటికి మొన్న మాజీ ఆల్రౌండర్ ఐన ఇర్ఫాన్ పటాన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతం హర్భజన్ సింగ్ కూడా రిపీట్ చేశాడు. 

 

 టీమిండియా సెలెక్టర్లు కనీసం తనను పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు అంటూ వ్యాఖ్యానించిన హర్భజన్ సింగ్.. నేను ఆడేందుకు  సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా కనీసం పట్టించుకోవడం లేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను ఇంకా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్నాను.. తాను  ఐపీఎల్లో బౌలింగ్ చేయగలిగినప్పుడు భారత జట్టులో ఎందుకు బౌలింగ్ చేయలేను.. వాస్తవంగా  చెప్పాలంటే భారత జట్టులో కంటే ఐపీఎల్లో బౌలింగ్ చేయడం చాలా కష్టం. బౌలర్లకు ఐపీఎల్ అనేది ఎంతో క్లిష్టమైనది... ప్రపంచంలోని టాప్ ప్లేయర్ లందరూ ఐపీఎల్లో ఆడుతూ ఉంటారు. అయితే తాను ఐపీఎల్ ఆడుతున్నాను అన్న విషయాన్ని సెలెక్టర్లు మర్చిపోయారు అనుకుంటా అంటూ వ్యాఖ్యానించారు హర్భజన్  సింగ్ . ఐపీఎల్లో తాను బాగా రాణిస్తున్నప్పటికీ నాలుగేళ్ల నుంచి సెలెక్టర్లు తనను పరిశీలించడం లేదు అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: