ప్రస్తుత క్రికెట్లో మిస్టర్ పర్ఫెక్ట్ గా పిలుచుకునే మన టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏ పని చేసిన ఖచ్చితత్వం ఉండేలా అందులో చూస్తాడు. తనకు సంబంధించి ఏ విషయంలోనైనా మిస్టర్ పర్ఫెక్ట్ గానే ఉండాలి అంటూ అతను వ్యవహరిస్తాడు. కరోనా వైరస్ నేపథ్యంలో మొదలు పెట్టిన లాక్ డౌన్ నేపథ్యంలో ఆటగాళ్ళందరూ ఇంటికే పరిమితమైన నేపథ్యంలో విరాట్ కోహ్లీ కూడా ఇంట్లోనే ఉంటూ తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడు. అయితే గత కొద్ది రోజులుగా తన ఇంస్టాగ్రామ్ పోస్టుల ద్వారా వరుసపెట్టి వీడియోలను షేర్ చేస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

My first shot at 180 landings. Top exercise 👌

A post shared by Virat Kohli (@virat.kohli) on

 


ఇక తాజాగా విరాట్ కోహ్లీ మరో వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. ఇక అందులో 180 డిగ్రీల కోణం ల్యాండింగ్ ఎక్సర్సైజ్ వీడియోను షేర్ చేశాడు కోహ్లీ. ఆ వీడియో లో కోహ్లీ కేవలం తన ఒక కాలి పాదం సహాయంతోనే ఒక వైపు తిరిగి 180 డిగ్రీల కోణంలో మరో పదం సహాయంతో ఇంకోవైపు తిరగేశాడు. చూడటానికి ఈ ఎక్సర్సైజ్ చాలా కఠినంగా ఉన్నా కోహ్లీ మాత్రం దాన్ని మిస్టర్ పర్ఫెక్ట్ గా ముగించేశాడు. ఇక ఆ వీడియో కి " నా ఫస్ట్ 180 ల్యాండింగ్ ఎక్ససైజ్... ఇదేనా టాక్ ఎక్సర్సైజ్... " అంటూ క్యాప్షన్ ని జత చేశాడు.


ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక తన అభిమానులు వరుసపెట్టి కామెంట్ల వర్షాన్ని ఆ వీడియోకు కురిపిస్తున్నారు. ఇకపోతే మంగళవారం నాడు కూడా హర్భజన్ సింగ్ డంబుల్స్ తో చేసిన వర్ అవుట్ పై విరాట్ కోహ్లీ సరదాగా స్పందించిన సంగతి కూడా తెలిసిందే. ఇక అందులో హర్భజన్ ను ఉద్దేశించి " పాజి... మెల్లగా బిల్డింగ్ షేక్ అవుతుంది " అంటూ కాస్త ఫన్నీగా కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కామెంట్ కూడా చాలా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: