టీమిండియా క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త ఒకటి వచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో జరుగుతుందో జరగదో అన్న ఆస్ట్రేలియా పర్యటన ఖరారు అయ్యింది. ఈ సంవత్సరం చివర్లో జరగాల్సిన ఈ సిరీస్ పై ఇప్పటికే అనేక ఆటుపోట్లు రాగా చివరకు ఈ సిరీస్ పై అధికారిక ప్రకటన వచ్చింది. బయో సెక్యూర్ వాతావరణం లాంటివి అవసరం లేకుండా టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఇరుదేశాల బోర్డు బుధవారం నాడు ఒక అంగీకారానికి వచ్చాయి. దీంతో కరోనా వ్యాధి తర్వాత తొలి మేజర్ అంతర్జాతీయ సిరీస్ గా ఇది నిలబడుతోంది. 4 టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో భాగంగా డిసెంబర్ 3న బ్రిస్బేన్ లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. 


ఇక ఈ రెండు జట్ల మధ్య అడిలైడ్ లో గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్, అలాగే మెల్బోర్న్ లో బాక్సింగ్ డే టెస్ట్, సిడ్నీలో ఆఖరి టెస్టు జరగబోతున్నాయి. కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకొని తొలుత అన్ని మ్యాచ్ లను ఒకటి లేదా రెండు వేదికల్లో మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించాలని అనుకుంది. కాకపోతే బీసీసీఐ సంప్రదాయ సిరీస్ కు ఓకే అనడంతో క్రికెట్ ఆస్ట్రేలియా పని చాలా సులువు అయిపోయింది. ఈ సిరీస్ పర్యటనపై పూర్తిస్థాయి సందిగ్దత తొలిగే అవకాశం లేకపోయినా ఈ సిరీస్ ను నిర్వహించుటకు క్రికెట్ ఆస్ట్రేలియా ఎలాంటి సమస్యలు లేకపోవడంతో తమకు అభ్యంతరం లేదని బీసీసీఐ కార్యదర్శి అరుణ్ ధూమల్ స్పష్టం చేశారు.


ఇకపోతే ఆ సీరియస్ ప్రకటించిన సమయానికి రెండు దేశాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అన్న పరిస్థితిని బట్టి మ్యాచులు జరుగుతాయో లేదో ఆధారపడి ఉంటుందని వారు తెలియజేశారు. ఇకపోతే ఈ పరిస్థితులకు తగ్గట్లుగా రీషెడ్యూల్ చేసుకునేందుకు రెండు బోర్డులు ఒక అంగీకారానికి వచ్చాయి అని తెలుస్తోంది. ఒకవేళ పరిస్థితులు ఇలాగే తీవ్రంగా ఉంటే మాత్రం తిరిగి ఒకే వేదికపై అన్ని మ్యాచులు నిర్వహించాల్సి రావచ్చును అని బీసీసీఐ వర్గాలు తెలియజేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: