ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని స్థాయిల  క్రికెట్ పోటీలు నిలిచిపోయిన విషయం తెలిసిందే . ఎక్కడ ఆటగాళ్లు  ఎవరూ కనీసం మైదానంలోకి దిగడం లేదు. దాదాపు అన్ని ప్రభుత్వాలు ఎలాంటి ఆటలకు అనుమతి ఇవ్వని నేపథ్యంలో ప్రస్తుతం ఆటగాళ్లందరూ కేవలం ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో అటు ప్రపంచవ్యాప్తంగా క్రీడా అభిమానులు అందరూ ఎంతో నిరాశతో ఉన్నారు . ముఖ్యంగా భారత క్రికెట్ అభిమానులు  అయితే మరింత నిరాశ చెందుతున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రస్తుతం ఒక వేళ కరోనా  వైరస్ ప్రభావం గనుక లేకపోయి ఉంటే ఐపీఎల్ మ్యాచ్ లతో హోరెత్తిపోయి  ఉండేది మొత్తం. క్రికెట్ ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించేది ఐపీఎల్. 

 

 సరిగ్గా ఐపీఎల్ ప్రారంభమవుతుంది అని క్రికెట్ ప్రేక్షకులు వేయికళ్ళతో ఎదురు చూస్తున్న తరుణంలో కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  విధించడం సంచలనంగా మారిపోయింది. ఇక ఆ తర్వాత ఐపీఎల్ నిర్వహించడానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయి. ఏప్రిల్ 15 తర్వాత ఐపీఎల్ నిర్వహించారని బీసీసీఐ  భావించినప్పటికీ... దేశంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గకపోవడంతో బిసిసీఐ ఆ  ఆలోచనను విరమించుకుంది . దీంతో రోజు రోజుకు ఐపీఎల్ పై  నీలినీడలు  కమ్ముకుంటున్నాయి . అసలు ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందా లేదా అన్నది కూడా సర్వత్రా అయోమయం నెలకొంది.

 


 అయితే ఈ ఏడాది అక్టోబర్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఐపీఎల్ వాయిదా పడటం కారణంగా అటు  బీసీసీఐ  కు వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో పాటు ఎంతో మంది ఆటగాళ్ల కెరియర్ కూడా అయోమయంలో పడింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ జరుగుతుందా జరగదా అనేదానిపై అటు ప్రేక్షకులు  బిసిసిఐ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే స్పందిస్తూ ఐపీఎల్ కచ్చితంగా జరుగుతుంది అనే  నమ్మకం ఉంది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్ జరుగుతుంది కానీ స్టేడియంలో మాత్రం ప్రేక్షకులు ఉండరు అని తెలిపారు అనిల్ కుంబ్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: